యాక్షన్ కింగ్ అర్జున్ గురించి పరిచయం అవసరం లేదు. 80లలో టాలీవుడ్ స్ట్రెయిట్ హీరోలకు ధీటుగా రాణించిన ప్రతిభావంతమైన హీరో. మార్షల్ ఆర్ట్స్ కింగ్ గా అతడు ఆ రోజుల్లోనే తనకంటూ యూనిక్ ఐడెంటిటీని తెచ్చుకున్నారు. యాక్షన్ రారాజుగా వెలిగిపోయారు. తెలుగు-తమిళం-కన్నడ రంగాల్లో అతడు అగ్ర హీరోగా హోదాను కొనసాగించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇటీవలి కాలంలో అతడు తెలుగు హీరోలకు విలన్ గానూ నటిస్తున్నారు. క్లాస్ విలనీకి అర్జున్ పెట్టింది పేరు.
ఇంతకుముందు `లై` చిత్రంలో నితిన్ కి విలన్ గా కనిపించాడు. ఇప్పుడు రవితేజ ఖిలాడీలో ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు. మాస్ రాజాతో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే పాత్రలో అర్జున్ మెస్మరైజ్ చేయనున్నారు. ఈనెల 11 నుంచి ఖిలాడీ యాక్షన్ థియేటర్లలో అసాధారణంగా కొనసాగనుంది.
ఇకపోతే అర్జున్ సర్జా తన కుటుంబంతో సెలబ్రేట్ చేస్తున్న ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. అర్జున్ తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. నటుడిగా దర్శకనిర్మాతగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా అతడు కుటుంబానికి అవసరమైన సమయాన్ని కేటాయించేందుకు ఇష్టపడతారు. ఇక అర్జున్ కి తన కుమార్తె .. నటవారసురాలు ఐశ్వర్య అర్జున్ అంటే ఎంతో గొప్ప అనురక్తి. తనను స్టార్ ని చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్వీయదర్శకత్వంలో ఐశ్వర్యతో ఆయన సినిమాల్ని తెరకెక్కించారు.
అర్జున్ ఫ్యామిలీ ఇతర వివరాలు పరిశీలిస్తే..
*అతడు ..నటుడు దర్శకుడు.. నిర్మాత.. స్క్రీన్ రైటర్.. డిస్ట్రిబ్యూటర్
*1981 నుంచి ఇప్పటి వరకు క్రియాశీలకంగా సినీరంగంలో కొనసాగుతున్నారు..
*జీవిత భాగస్వామి నివేదిత (మ. 1988)
* పిల్లలు -ఐశ్వర్య - అంజనా సర్జా
* తండ్రి: శక్తి ప్రసాద్
* కిషోర్ సర్జా (తమ్ముడు)
* చిరంజీవి సర్జా (మేనల్లుడు)
* ధృవ సర్జా (మేనల్లుడు)
* రాజేష్ (మామ)
* బంధువులు: కరుణానిధి కుటుంబం