సౌత్ ఇండియన్ యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా.. చాలకాలం తర్వాత అభిమానుల ముందుకు ఓ శుభవార్తతో వచ్చాడు. సినీ యాక్టర్స్ కూడా సినిమాల్లో హీరోలుగా విలన్స్ గా నాస్తికులుగా నటించినప్పటికి బయట పర్సనల్ లైఫ్ లో మాత్రం ఏదొక దేవుడిని పూజిస్తూనే ఉంటారు. కొందరు రెగ్యులర్ గా గుడికి వెళ్లి ఇష్టమైన దైవాన్ని దర్శించుకుంటారు. కొందరు యాక్టర్స్ దేవుడిని తలుచుకుంటూ ఇంటి పట్టునే పూజలు ఆచరిస్తారు. కానీ వీరందరిలో కంటే కూడా మహాభక్తులు కొందరుంటారు. అలాంటి మహా దైవభక్తి కలిగిన హీరోలలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కబురు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు అర్జున్. ఆయన హీరోగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో లక్షలసంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా తాను సంకల్పించిన మహాకార్యం పూర్తి అయిందని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. అర్జున్ వ్యక్తిగతంగా ఆంజనేయస్వామి మహాభక్తుడు. దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఆంజనేయస్వామి టెంపుల్ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి ఇటీవలే అంటే.. 15 సంవత్సరాల తర్వాత హనుమాన్ టెంపుల్ నిర్మాణం పని పూర్తి అయింది.
అయితే జులై 1-2 తేదీలలో ఆంజనేయ స్వామి ఆలయంలో కుంభాభిషేకం జరుపనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ.. "15ఏళ్లుగా సంకల్పించిన ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం ఇప్పుడు పూర్తి అయింది. జులై 1-2 తేదీలలో కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు స్నేహితులు.. బంధువులు.. అభిమానులు.. భక్తులు అందరిని ఆహ్వానించాలని అనుకున్నాం. కరోనా కారణంగా ఎవరిని పిలవలేక పోతున్నాం. కానీ అందరూ ఈ కుంభాభిషేకం మిస్ అవ్వకూడదని లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆ విధంగా దర్శనం చేసుకోవచ్చు." అని తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఇదివరకు అర్జున్ శ్రీ ఆంజనేయం చిత్రంలో హనుమాన్ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.