'యాక్ష‌న్' అంతిమ ఫ‌లితం ఇదే!

Update: 2019-11-30 01:30 GMT
విశాల్ క‌థానాయ‌కుడిగా సుంద‌ర్ సి. ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. విశాల్ కెరీర్ లో అత్యంత‌ భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. దాదాపు 60 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. దీంతో సినిమాను తెలుగు- త‌మిళ్ భాష‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేసి రిలీజ్ చేసారు. భారీ విజువ‌ల్ గ్రాండియారిటీతో ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. సుంద‌ర్ సి ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి తీసిన చిత్ర‌మిది. విశాల్ న‌ట‌న‌.. త‌మ‌న్నా అంద‌చందాలు యూత్ కి న‌చ్చాయి. అయితే ఆశించ‌న‌ది ఒక‌టి కానీ అయిన‌ది ఇంకొక‌టి. బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఆశించిన స్థాయిని అందుకోవ‌డంలో మాత్రం విఫ‌లమైంద‌ని ట్రేడ్ లెక్క‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికే రెండు వారాలు పూర్త‌యింది. తొలి షోతోనే సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. మంచి ఓపెనింగ్స్  అయితే ద‌క్కాయి గానీ వాటిని కొన‌సాగించ‌లేక‌పోయింది. 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.87 కోట్ల షేర్ మాత్ర‌మే తేగ‌లిగింది. అయితే ఇటీవ‌ల విశాల్ సినిమాల‌కు మ‌ళ్లీ మార్కెట్ పుంజుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినిమా 6.7 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల నుంచి  వ‌చ్చిన వ‌సూళ్లు మాత్రం నిరాశ‌నే మిగిల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 7.2 కోట్ల షేర్ తీసుకురావాలి. కానీ స‌గం వ‌సూళ్లు అయినా తేలేదు.

మ‌రో 4.33 కోట్లు షేర్ అందుకుంటే త‌ప్ప బ్రేక్ ఈవెన్ చేయ‌లేదు. ఇప్ప‌టికే 13 రోజులు గ‌డిచిన నేప‌థ్యంలో అంత మొత్తం తేవాడం అంటే అసాధ్య‌మ‌నే అనిపిస్తోంది. ఇక కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా ఫ‌ర్వాలేద‌న్న టాక్ అయితే వ‌చ్చింది. బాక్సాఫీస్ లెక్క‌లు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News