యాక్టర్ దర్శన్ కి రూ. 25 కోట్లు టోకరా పెట్టబోయారు ... చివర్లో ఏమైందంటే !

Update: 2021-07-13 06:56 GMT
ఈ మధ్య కాలంలో మోసగాళ్లు ఎక్కువైపోయారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నెత్తిన టోపీ పెట్టి ఉన్న కాడికి దోచుకుంటారు. తాజాగా యాక్టర్ దర్శన్ కి కేటుగాళ్లు 25 కోట్లకి కుచ్చుటోపీ పెట్టబోయారు. అయితే , ఆ విషయం బయటపడటంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు దర్శన.  సినిమాల్లో విలన్లను మట్టికరిపించే దర్శన్‌ నిజ జీవితంలో మోసగాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు సాదాసీదా చీటర్లు కాదు ఏకంగా రూ.25 కోట్లకు ఎసరు పెట్టారు. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్‌ ఘాటుగా స్పందించారు. నా ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ. 25 కోట్లను పొందాలని చూసి, నాపై కుట్ర చేసినవారు ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా పోరాడుతా వెల్లడించారు.

మైసూరులో మీడియా సమావేశంలో దర్శన్‌  మాట్లాడుతూ ..  జూన్‌ 6వ తేదిన నా మిత్రుడు, కన్నడ సినిమా నిర్మాత  ఉమాపతి నాకు ఫోన్‌ చేసి రూ.25 కోట్ల బ్యాంకు రుణానికి మీరు ష్యూరిటీ సంతకం చేశారా  అని అడిగారు. నేను అయోమయానికి గురయ్యాను. ఏం జరిగిందని ఉమాపతిని అడగ్గా ఏమీ చెప్పలేదు. జూన్‌ 16వ తేదీన అరుణాకుమారి అనే మహిళను నిర్మాత ఉమాపతి నా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె నా స్నేహితుల పేర్లను చెబుతూ కొన్ని దాఖలాలు చూపించారు. అందులో నా ఆధార్‌ నంబర్‌ తప్ప ఇంకేమీ లేదు. నేను పుట్టిన ప్రాంతం, జిల్లా పేరును ఆమె చెప్పగా అనుమానం పెరిగింది.

నేను ఆమె ముందే నాగు, హర్ష అనే నా మిత్రులకు కాల్‌ చేసి లోన్‌కు దరఖాస్తు పెట్టారా అని అడిగా, లేదు అని చెప్పారు. మరోసారి అరుణతో నందీష్, మదుకేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. లోన్‌ ఇవ్వడానికి ముందు మీ తోటను చూడాలని అడగ్గా, సరే అన్నాను. నా తరఫున లోన్‌ కోసం హర్ష రికార్డులు ఇచ్చారని అరుణ చెప్పారు. చివరకు నా స్నేహితులందరినీ ఆరా తీయగా ఎవరూ రుణం కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. అరుణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశా  అని ది బాస్‌ వివరించారు. సూత్రధారులు, పాత్రధారుల గురించి పోలీసుల విచారణలో బయటికి వస్తుందని దర్శన్‌ అన్నారు.నకిలీ పత్రాలను తయారుచేసిన వంచకులు వాటిని దర్శన్‌ స్నేహితులకు చూపి మాట వినకపోతే దుష్ప్రచారం చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. దర్శన్, ఉమాపతి తదితరులు మైసూరు డీసీపీ ప్రదీప్‌ గుంటిని కలిసి ఫిర్యాదు చేశారు.

 ఇంకా అయన మాట్లాడుతూ ..  నకిలీ బ్యాంకు మేనేజర్‌ అరుణకుమారి పోలీస్‌ కస్టడీలో ఉన్నారని వి చారణలో నిర్మాత ఉమాపతి, హర్షల పేర్లు బయటపడ్డాయన్నారు. వాస్తవాలు బహిరంగం చేయాలని నా ఆస్తులకు సంబంధించి రికార్డులు ఫోర్జరీపైనా స్పష్టత కావాలన్నారు. నకిలీ బ్యాంకు మేనేజర్‌ అరుణకుమారి భర్తను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆమె పీయూ చదివారని, బ్యాంకులో ఉద్యోగమే లేదన్నారు. సోషియల్‌ క్లబ్‌ సెక్యూరిటీలో అరుణకుమారి భర్తకు మార్‌ పనిచేస్తున్నారన్నారు. నాలుగైదు ఏళ్లక్రితమే విడిపోయారన్నారు. భార్య మోసాలకు పాల్పడుతున్నార ని భర్త కూడా ఆరోపించారు.
Tags:    

Similar News