నాగ శౌర్య కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..!

Update: 2022-11-10 16:37 GMT
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ ని గుడ్ బై చెబుతూ.. అనూష శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించాడు. ఈ నవంబర్ 20న తన ఇష్టసఖితో ఏడడుగులు వేయబోతున్నట్లు తెలిపాడు.

నాగశౌర్య మరియు అనూష శెట్టి వివాహం బెంగుళూరులోని జెడబ్ల్యూ మారియట్ లో ఈ నెల 20న ఉదయం 11.25 గంటల శుభ ముహూర్తంలో జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే నాగ శౌర్య కాబోయే భార్య అనూష శెట్టి గురించిన వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? శౌర్య కు ఎప్పటి నుండి పరిచయం? వంటి విషయాలపై ఆరాలు తీస్తున్నారు.

అనూషా శెట్టి ఒక ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తోంది. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుండి ఇంటీరియర్ డిజైన్ సర్టిఫికేషన్ తీసుకుంది. అలానే ఎంట్రప్రెన్యూర్‌ షిప్ మార్కెటింగ్‌ లో మాస్టర్స్ డిగ్రీని కలిగి వుంది.

అనూష జాతీయ స్థాయిలో ఎస్టేట్ అవార్డు నుండి డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 & 2020 టైటిల్‌ ను గెలుచుకుందని తెలుస్తోంది. అంతేకాదు ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఎక్సలెన్స్ అవార్డుల ద్వారా 2020లో దేశంలోని 40 ఏళ్లలోపు 40 మంది అత్యుత్తమ ఇంటీరియర్ డిజైనర్లలో ఒకరిగా అనూషా శెట్టి నిలిచారు.

దేశంలోనే అగ్రశ్రేణి ఇంటీరియర్ డిజైనర్‌ గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మ్యాగజైన్ కవర్ పేజీలో అనుషా శెట్టి కనిపించింది. ఆమె ప్రస్తుతం ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్ మరియు ల్యాండ్‌ స్కేప్‌ లో ప్రత్యేకత కలిగిన ఓ కంపెనీని నడుపుతోందని సమాచారం.

ప్రస్తుతానికి అనూష శెట్టి - నాగ శౌర్య ఇద్దరూ ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు? ఎప్పుడు కలిశారు? ఎలా ప్రేమలో పడ్డారు? అనేది తెలియలేదు. అనూష ఫ్యామిలీ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అందుకే ఇప్పుడు నాగశౌర్య - అనూష పెళ్లిని అక్కడే గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌ తో ప్రీ-వెడ్డింగ్ ఫార్మాలిటీస్ ప్రారంభమవుతాయి. మెహందీ మరియు వివాహ వేడుకలకు వేర్వేరు దుస్తుల కోడ్‌ లు ఉంటాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News