ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా పాన్ ఇండియాపైనే దృష్ణి పెట్టిన సంగతి తెలిసిందే. `బాహుబలి`తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించబడితే..అటుపై `ఆర్ ఆర్ ఆర్` తో యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ప్రమోట్ అయ్యారు. ఈ ముగ్గురి వెనుక రాజమౌళి కీలకపాత్ర పోషించారు కాబట్టి సాధ్యమైంది. ఇదే లైనప్ లో తదుపరి సూపర్ స్టార్ మహేష్ చేరబోతున్నారు. రాజమౌళ తదుపరి సినిమా హీరోగా మహేష్ లాక్ అయిన సంగతి తెలిసిందే.
ఆప్రికన్ అడవుల నేపథ్యంలో ఇండియన్ స్ర్కీన్ పైనే మొదటిసారి రాబోతున్న చిత్రమిది. `బాహుబలి ది కనుక్లూజన్`...`దంగల్` చిత్రాల వసూళ్ల టార్గెట్ గా జక్కన్న మహేష్ ని రంగంలోకి దించుతున్నారు. దశాబ్ధాల క్రితమే మహేష్ హాలీవుడ్ రేంజ్ అంటూ..హాలీవుడ్ స్టార్ లా ఉంటాడంటూ ప్రశసంలందుకున్నారు. ఇప్పుడు ఆ మాటని నిలబెటట్టడానికి జక్కన్న అండ్ కోరంగంలోకి దిగుతుంది.
ఇక మీడియం రేంజ్ హీరోల విషయానికి వస్తే పాన్ ఇండియాని టార్గెట్ చేసిన మెయిన్ హీరోలుగా ఇద్దరు కనిపిస్తున్నారు. వాళ్లే నేచురల్ స్టార్ నాని..ట్యాలెంటెడ్ నటుడు నిఖిల్. ఇంత టఫ్ కాంపిటీషన్ నడుమ ఇద్దరు ఇండస్ర్టీలో ఇప్పటివరకూ నిలబడగలిగారు అంటే కేవలం వాళ్లలో ఉన్న డిఫరెంట్ క్వాలిటీ అనే చెప్పాలి. కంటెంట్ పరంగా రొటీన్ కి భిన్నమైన కథలు..పాత్రలు ఎంచుకోవడం వల్ల పరిశ్రమలో నేడు రాణించి మీడియం రేంజ్ స్టార్లుగా ఎదిగారు.
రెగ్యలుర్ కమర్శియల్ చిత్రాలకు దూరంగా ఆలోచించడమే వాళ్లని ఇండస్ర్టీలో నిలబెట్టగల్గింది. ఇప్పుడు ఇద్దరు హీరోలు పాన్ ఇండియాపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ ఏకంగా రెండు సినిమాలతో పాన్ ఇండియాకి రెడీ అవుతున్నాడు. అవే `కార్తికేయ-2`.. `స్పై`. మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ గా `కార్తికేయ`కి సీక్వెల్ గా చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం ముగింపు చాలా ఆసక్తిగా ఉంటుంది. దీంతో `కార్తికేయ-2` ఉంటుందని ఆనాడే రివీల్ అయింది.
సబ్జెక్ట్ పరంగానూ యూనిక్ గా ఉంటుంది. ఇలాంటి చిత్రాలు పాన్ ఇండియాలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అందుకే తెలుగుతో పాటు ..ఇతర భాషల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమచారం అందుతోంది. అలాగే `స్పై` అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇది డిఫరెంట్ జానర్ సినిమా. దీంతో ఈ సినిమాతోనూ పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇక నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వంలో `దసరా`లో నటిస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రొటీన్ కి భిన్నంగా తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో తెలుగు కంటెంట్ కి ఇతర పరిశ్రమలో దక్కుతోన్న ఆదరణ అనే నమ్మకంతోనే యంగ్ హీరోలిద్దరు ఇలా పాన్ ఇండియా అటెంప్ట్ లకు రెడీ అవుతున్నట్లు గుస గుస వినిపిస్తోంది.