శ్రీ‌దేవికి అప్ప‌ట్లో ఐ ల‌వ్యూ చెప్పార‌ట‌!

Update: 2016-07-26 04:58 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అంటే ఇష్ట‌ప‌డివారు ఎవ‌రుంటారు చెప్పండి..? ఇక‌, ఆరోజుల్లో హీరోయిన్‌ గా ఆమె ఒక వెలుగు వెలుగుతున్న‌ప్పుడు ఎంత‌మంది ఆమె వెంట‌ప‌డి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా! ఆమెని మూగ‌గా ఆరాధించేవారు ఎంతోమంది. శ్రీ‌దేవి హీరోయిన్ కాక‌ముందు కూడా ఆమె వెంట‌ప‌డిన‌వారు ఉన్నారండోయ్‌. అలా వెంట‌ప‌డినవారిలో తాను కూడా ఉన్నాన‌ని చెబుతున్నారు ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్‌. న‌టుడిగా 45 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా త‌న కెరీర్‌ లో కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను ఒక్క‌సారి నెమ‌రు వేసుకున్నారు న‌రేష్‌. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకున్నారు.

న‌టి శ్రీ‌దేవీ - తానూ అప్ప‌ట్లో ప‌క్క‌ప‌క్క ఇళ్లల్లోనే ఉండేవార‌మ‌ని న‌రేష్ చెప్పారు. అంతేకాదు - ఇద్ద‌ర‌మూ క‌ల‌సి ఒకే చోటికి ట్యూష‌న్స్‌ కు వెళ్తూ ఉండేవార‌ట‌. అదే స‌మ‌యంలోనే శ్రీ‌దేవి అంటే న‌రేష్‌ కు అట్రాక్ష‌న్ క‌లిగింది. ఓ రోజున ధైర్యం చేసి ఆమెకి ఐ ల‌వ్ యూ అని చెప్పేశార‌ట‌! దాంతో వెంట‌నే స్పందించిన శ్రీ‌దేవి... ఈ విష‌యం మా అమ్మతో చెబుతా జాగ్ర‌త్త అనేసింద‌ట‌! అంతే, దాంతో న‌రేష్ భ‌య‌ప‌డిపోయి... కొన్నాళ్ల‌పాటు శ్రీ‌దేవి జోలికి వెళ్ల‌డం మానేశార‌ట‌.

ఇదే విష‌యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ.. శ్రీ‌దేవి టాప్ హీరోయిన్ అయ్యే వ‌ర‌కూ ఆమెని క‌లుసుకోలేద‌ని అన్నారు. త‌రువాత కొన్నాళ్లకు ఎదురుప‌డింద‌నీ, చిన్న‌ప్పుడు తాను ఐ ల‌వ్ యూ చెప్పిన విష‌యాన్ని గుర్తుచేసుకుని మ‌రీ న‌వ్వింద‌ని చెప్పారు న‌రేష్‌. ఆ విష‌యాన్ని ఆమె ఇన్నాళ్లైనా జ్ఞాపకం ఉంచుకుందా అని ఆశ్చ‌ర్య పోయా అన్నారు.
Tags:    

Similar News