అనారోగ్యంతో ఇంట్లో పడుకున్న మహిళపై అత్యాచారం చేశాడట ఓ సినీ హీరో. విచక్షణ మరిచి, ఆమె ఒంటిమీదున్న దుస్తులన్నీ చింపేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడట. ఈ విషయం కోర్టులో రుజువు కావడంతో.. న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
హాలీవుడ్ నటుడు కెవిన్ గుత్రీ ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. 2017లో గ్లాస్గోవ్ లోని బార్ లో కెవిన్ గుత్రీ.. సహచ నటుడు స్కాట్ రీడ్ కు ఓ మహిళ పరిచయం అయ్యిందట. పార్టీ ముగిసిన తర్వాత సదరు మహిళ.. ట్యాక్సీలో తన ఇంటికి బయల్దేరిందట. అయితే.. ఆమెకు ప్రయాణం మధ్యలోనే కాస్త అనారోగ్యంగా అనిపించిందట. దీంతో.. ఈ విషయాన్ని కెవిన్ కు తెలిపిందట.
దీంతో.. కెవిన్, స్కాట్ రీడ్ ఇద్దరూ కలిసి సదరు మహిళ ఇంటికి బయల్దేరి వెళ్లారట. ఆ సమయానికి అస్వస్థతతో ఉన్న ఆ మహిళ బెడ్ రూమ్ లో పడుకొని ఉందట. ఆ సమయంలోనే కెవిన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. ఒంటిపై దుస్తులు మొత్తం చించేసి, బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందట.
కేసు నమోదు చేసిన ఇంగ్లండ్ పోలీసులు.. బాధిత మహిళకు డీఎన్ఏ, ఇతర వైద్య పరీక్షలు కూడా జరిపించారట. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కెవిన్ అత్యాచారం చేసినట్టు నిర్ధారించిందని సమాచారం. దీంతో.. కెవిన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్టు సమాచారం. 1999లో ర్యాట్ క్యాచర్ సినిమాతో హాలీవుడ్ లోకి ప్రవేశించిన కెవిన్.. ఎన్నో మంచి చిత్రాల్లో నటించాడు. అలాంటి వ్యక్తి రేప్ కేసులో జైలుపాలవడం చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.