కొడుకుతో వెళితే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారు

Update: 2018-03-10 06:43 GMT
స్టార్ సెలబ్రెటీలు ఏడాదికి ఒక సినిమాలో మాత్రమే కనిపిస్తారు. మహా అయితే రెండు సినిమాల్లో..  కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం రోజు బిజీగా ఉంటారు. చిన్న పాత్ర వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్లిపోతారు. ఫైనల్ గా వారే ఎక్కువ సినిమాలు చేస్తారు. సినిమాల రిజల్ట్ తో వారికి సంబంధం ఉండదు. చేసుకుంటూ వెళ్లడమే.. వయసు పై బడే వరకు కూడా సినిమాలు చేస్తుంటారు. అలాంటి వారిలో సనా కూడా ఉన్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొన్నటి వరకు సనా చాలా బిజీ. అయితే ఇప్పుడు మాత్రం కొంచెం స్లో అవ్వాల్సి వచ్చింది. అయితే అందంలో సనాకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చూడగానే ఆకట్టుక్కునే నవ్వు ఆమె సొంతం. హీరోయిన్స్ సిస్టర్ క్యారెక్టర్ అంటే ఈజీగా నమ్మేస్తారు. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒక సరదా విషయం గురించి చెప్పుకున్నారు. ఒక రోజు తన కొడుకు అన్వర్ తో సినిమాకు వెళ్ళినపుడు చాలామంది వారినే చూశారట.

అయితే కొంత మంది అన్వర్ స్నేహితులు వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ను మాకు పరిచయం చేయవా.. అని అడిగేశారట. ఈ విషయాన్ని నవ్వుతూ సరదాగా చెప్పుకుంది సనా. ఇక తన మొదటి సినిమా నిన్నే పెళ్లాడతా అని చెబుతూ.. అప్పట్లో ఓ షోకి యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీ గారు చూసి నాకు అవకాశం ఇచ్చారని సనా తెలిపింది.    
Tags:    

Similar News