టాలీవుడ్ తెరపై సందడి చేసిన నిన్నటితరం హీరోయిన్స్ ల్లో సంగీత ఒకరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆమె ఒక దశలో బిజీ హీరోయిన్. 'ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్' అంటూ 'ఖడ్గం'తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తరువాత తెలుగులో ఆమె చాలానే సినిమాలు చేశారు. 'సంక్రాంతి' .. 'పెళ్ళాం ఊరెళితే' సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకుని వచ్చాయి. రీ ఎంట్రీ తరువాత కూడా ఆమె తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగీత మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి నేను చాలా లావుగా ఉండేదానిని. దానికి తోడు స్కిన్ కి సంబంధించిన సమస్యలు ఉండేవి. జ్యుయలరీ నాకు అస్సలు పడదు .. ఎలర్జీ వచ్చేస్తుంది. అప్పట్లో నేను ఎవరితోను ఎక్కువగా కలిసేదానిని కాదు.
షూటింగుకి రావడం .. యాక్ట్ చేయడం .. వెళ్లిపోవడం. ఎవరితోను ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. కానీ ఒక నటి అలా ఉండకూడదు కదా. గ్లామర్ .. టాలెంట్ తో పాటు జనంలోకి చొచ్చుకుపోయే లక్షణం కూడా ఉండాలి. కానీ అప్పుడు నాకు అవేమీ తెలియదు. అందువలన నేను హీరోయిన్ మెటీరియల్ కాదు అని అంటూ ఉండేదానిని.
ఇండస్ట్రీలో అందరికీ టచ్ లో ఉండాలి .. ఒక యాక్టర్ కి కొన్ని ప్రొడక్షన్ హౌస్ లతో కనెక్షన్ ఉంటుంది. ఒక డైరెక్టర్ కి ఒక నెట్ వర్క్ అనేది ఉంటుంది. కానీ నాకు అసలు ఎలాంటి నెట్ వర్క్ ఉండేది కాదు. అప్పుడే కాదు .. ఈ విషయంలో ఇప్పుడు కూడా వీకే. నేను చేసే సినిమా గురించి తప్ప ఎక్కడ ఏం జరుగుతోంది? ఎవరెవరు ఏయే సినిమాలు చేస్తున్నారు? అనేది నాకు తెలియదు. నాకు వచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. స్కిన్ సమస్యల వలన .. తెరపై మరింత లావుగా కనిపించడం వలన నేను సినిమాలు చేయనని అమ్మతో అంటూ ఉండేదానిని.
ఇంతవరకూ కూడా అవకాశాల కోసం నేనుగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. వచ్చిన అవకాశాలన్నీ కూడా ఆ దేవుడి దయవలన వచ్చినవే. బాలా గారి దర్శకత్వంలో 'శివపుత్రుడు'చేసే ఛాన్స్ వచ్చింది. 90 రోజులపాటు కాల్షీట్స్ కావాలంటే కుదరదని చెప్పాను.
కానీ అందరూ కూడా బాలా గారి సినిమా వదులుకుని తప్పు చేశావని అనడం మొదలుపెట్టారు. అప్పుడు నేను చేస్తున్న తెలుగు సినిమా అనుకోని కారణాల వలన ఆగిపోయింది. ఆ సమయంలో బాలాగారికి కాల్ చేస్తే 'శివపుత్రుడు' షూటింగుకి వచ్చేయమన్నారు. అలా ఆ సినిమాలో చేయడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.