సూపర్ స్టార్ మహేష్ కెరీర్ జర్నీలో ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాన్నగారు కృష్ణ బాటలోనే ఆయన పయనించారు. ఈ తరం నటుల్లో ఏ ఇతర హీరో చేయనన్ని ప్రయోగాలు చేసిన ఘనత తన సొంతం. కమర్శియల్ చిత్రాలతో పాటు సందేశాత్మక చిత్రాలు చేయడం ఆయనకే చెల్లింది. తాజాగా మహేష్ కమిట్ మెంట్ గురించి నటుడు సునీల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు రివీల్ చేసారు. `` మహేష్ తో కలిసి చాలా సినిమాలు చేసాను. ఆయన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. ఎంత అందంగా..క్యూట్ గా ఉంటాడో సెట్ లో అంతే సరదాగాను ఉంటారు. ఆయన ఫన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. మహేష్ తో మాట్లాడటం..జోకులు వేడయం అంత వీజీ కాదు`` అని తెలిపారు.
ఇక నటుడిగా మహేష్ గ్రాఫ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుల్ని నమ్మి సినిమాలు చేస్తారు. దర్శకుడికి మాట ఇచ్చారంటే ఆ మాట కోసం నిలబడతారు. నటన పరంగా ఆయన కమిట్ మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. సెట్ లో సన్నివేశం పండటం కోసం గొడ్డులా కష్టపడతారు. యాక్షన్ సన్నివేశాల కోసం వీలైనంత రియాల్టీ చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నమే చాలా గొప్పగా ఉంటుంది. నడుము భాగానికి రోప్ లు కట్టుకుని ఎంత ఎత్తులో నుంచైనా దూకడానికి ఆలోచించరు. అలాంటి సన్నివేశాల కోసం బెస్ట్ వచ్చేంత వరకూ ట్రై చేస్తూనే ఉంటారు. నటన అంటే ఆయనకు అంత పిచ్చి.
చూడటానికి మహేష్ క్యూట్ గా..యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తారు.దర్శకుల్ని నమ్మితే అతనికి లైఫ్ ఇచ్చేస్తారు. మాట వెనక్కి తీసుకోవడం ఆయనకి తెలియదు. ఆయన లో ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది` అని తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఇక సునీల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే `పుష్ప` సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సునీల్ గెటప్ కి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్3` లో నటిస్తున్నారు. చరణ్ - శంకర్ ల ఆర్సీ 15లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.