అప్పట్లో సుమారు ఓ పాతిక సంవత్సరాల క్రితం నటి సౌందర్య ప్రభావం మొదలు కాకముందే హోమ్లీ హీరోయిన్ గా ఆమనిది ప్రత్యేకమైన స్థానం. మిస్టర్ పెళ్ళాంలో భర్త ఇంటిపట్టున ఉంటే తాను ఉద్యోగం చేసి జీతం రాళ్లు తీసుకువచ్చే పాత్రలో ఆమని నటన ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మావి చిగురు లాంటి ఉదాత్తమైన సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించిన ఆమని గ్లామర్ టచ్ ఇస్తూ నాగార్జున-బాలకృష్ణ-కృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన కూడా ఆడిపాడింది. కొంత కాలమే సినిమాల్లో ఉన్న ఆమని ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి అంకితమైపోయింది. ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ లో బాగానే కనిపిస్తున్న ఆమని ప్రస్తుతం పరిశ్రమను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి తనకు ఎదురైనా అనుభవాలు గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
పరిశ్రమకు వచ్చిన కొత్తలో అప్పుడే సినిమా నిర్మాణంలో దిగిన కొన్ని కంపెనీల నుంచి కాల్స్ వచ్చేవని తల్లి లేకుండా ఒంటరిగా గెస్ట్ హౌస్ రావాలని నొక్కి మరీ చెప్పినప్పుడే వాళ్ళ ఉద్దేశం అర్థమయ్యేదని వివరించింది. మరో షాకింగ్ న్యూస్ కూడా రివీల్ చేసారు ఆమని. తనకు మూవీ ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఫోటోల్లో చూసినంత అందంగా బయట ఉండేది కాదు అని అనే వారట. కాకపోతే మంచి పేరున్న అనుభవజ్ఞులైన దర్శకుల నుంచి హీరోల నుంచి తనకు ఎటువంటి సమస్యా రాలేదని క్లారిటీ ఇచ్చింది.
కేవలం తప్పుడు ఉద్దేశాలతో ఇండస్ట్రీకి వస్తున్న కొందరు నిర్మాతల నుంచి మాత్రమే ఇవి ఎదురుకున్నానని స్పష్టం చేసింది ఆమని. కెరీర్ ను ప్రారంభించిన మొదటి రెండేళ్లు ఇలాంటి ఇబ్బందులు ఆమనికి తప్పలేదట. బాపు-ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులతో సినిమాలు చేసాక ఇక వాటి గురించి ఆలోచించే అవసరమే రాలేదన్న ఆమని కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇలా ఓపెన్ అయిపోవడం విశేషమే.