మార్చురీలకు వెళ్తున్న మలయాళం బ్యూటీ!

Update: 2019-04-03 10:46 GMT
సౌత్ అంతటా గుర్తింపు ఉన్న అతి తక్కువమంది హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు.  ఆమె తన కొత్త సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటుగా నిర్మాతగా కూడా మారుతోంది.  ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ తమిళ సినిమాకు అనూప్ ఫణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయింది.

'కడవేర్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అమలా పాల్ ఫోరెన్సిక ప్యాథాలజిస్ట్ పాత్రలో నటిస్తోందట.  ఈ సినిమాను నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారట.   కేరళ పోలీస్‌ డిపార్ట్ మెంట్ లో ఫోరెన్సిక్‌ సర్జన్‌ అయిన బి. ఉమాదతాన్‌ కెరీర్ లో ఒక కాంప్లెక్స్ మర్డర్ కేసు ఎదురైందట. ఆ కేసు ఆధారంగానే ఈ చిత్రం కథను తయారు చేసుకున్నారట. ఈ సినిమాలో ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్ డాక్టర్ భద్ర పాత్రను సహజంగా పోషించేందుకు అమలా పాల్ ఎంతో ప్రిపరేషన్ కూడా చేసిందట.  

ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేయడంతో పాటుగా ఉమాదతాన్ తో కూడా ఈ ఫోరెన్సిక్ కేసుల గురించి అడిగి తెలుసుకుందట.  ఫోరెన్సిక్ కేసులంటేనే శవాలు.. మార్చురీ.. ఎవిడెన్సులు గట్రా ఉంటాయి. అందుకే హాస్పిటల్స్ ను కూడా సందర్శించిందట.  ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉంటుందని.. తనకు ఇదో ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పుకొచ్చింది అమల.  అంతే కాదు ఈ కథ తన వద్దకు నాలుగేళ్ల క్రితం  వచ్చిందని.. గత మూడేళ్ళుగా అనూప్ తన టీం తో స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడని తెలిపింది. ఒక హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం గొప్ప విషయమే
    

Tags:    

Similar News