అన్నీ ఉన్న అమృత‌ను పట్టించుకునే నాథుడే లేడా?

Update: 2022-11-16 08:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదనే చెప్పాలి. ఆకట్టుకునే అందం, అంతకుమించి టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో చాలా మంది హీరోయిన్లు ఆఫర్ల కోసం నానా తంటాలు పడుతున్నారు.

ఈ లిస్టులో అమృత అయ్యర్ ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిలా క‌నిపించే ఈ అందాల భామ‌.. బెంగళూరులో పుట్టి పెరిగింది. కాలేజీ చ‌దువు పూర్తైన వెంట‌నే న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న అమృత.. 'పదైవీరన్' అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా మారింది.

ఇటు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన 'రెడ్' సినిమాతో అమృత తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అమృతకు పెద్దగా గుర్తింపు ద‌క్క‌లేదు. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ తో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇటీవల 'అర్జున ఫల్గుణ' సినిమాలో మెరిసింది. తెలుగులో అమృత చేసిన‌ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. కానీ, అమృత అందాలకు మరియు నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్ లో స‌త్తా చాటుతుంద‌ని సినీ విశ్లేష‌కులు భావించారు. అయితే అన్నీ ఉన్న టాలీవుడ్ లో అమృతను  పట్టించుకునే నాథుడే లేడు.

సోష‌ల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ల‌తో క‌వ్విస్తున్నా.. అమృత వైపు  కనీసం యంగ్ హీరోలు కూడా చూడ‌టం లేదు. తెలుగులో ఈ అమ్మడు కేవలం ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. అదే 'హనుమాన్'. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై అమృత ఎన్నో ఆశలు పెట్టుకుంది. హనుమాన్ తో అయినా హిట్ కొట్టి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశపడుతుంది. మరి ఆమె ఆశ నెరవేరుతుందా..? లేదా..? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News