ముద్దు సీన్‌ తర్వాత కారవ్యాన్ లో ఏడ్చేశాను

Update: 2022-12-31 06:24 GMT
తెలుగు అమ్మాయి అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. సీనియర్ హీరోల నుండి మొదలుకుని యంగ్‌ హీరోల వరకు చాలా మందితో అంజలి నటించింది. ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశం తో మీడియాలో ఉంటూనే ఉంది.

మరోసారి అంజలి ఒక ఇంటర్వ్యూ లో ఇలా అంది అంటూ ఆమెను వార్తల్లో ఉంచాయి. తాజాగా ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్స్ పడుతున్న ఇబ్బందులను గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను మాత్రమే కాకుండా చాలా మంది ఇష్టం లేకుండా కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అంజలి మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకుండా అవతలి హీరోతో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వస్తుంది... కొన్ని సార్లు ఇంటిమేట్‌ సన్నివేశాలను చేయాల్సి వస్తుంది. ఎదుటి హీరో నచ్చక పోయినా కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంది.

ఇష్టం లేకున్నా అవతలి హీరోతో ముద్దు సన్నివేశాలు లేదా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి ఆ తర్వాత కారవ్యాన్‌ లో కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మంచి పాత్రలో నటించాలని ఆశ పడ్డ సమయంలో కొన్ని సార్లు ఇష్టం లేకుండానే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తుంది. అది అంజలి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క హీరోయిన్‌ కూడా ఏదో ఒక సమయంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అంజలికి పలువురు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది. రామ్‌ చరణ్ కు భార్య పాత్రలో రెండవ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇక తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News