పెళ్లి వార్తలపై కస్సుబుస్సులాడిన హీరోయిన్

Update: 2019-03-31 08:55 GMT
తెలుగు హీరోయిన్ అంజలి టాలీవుడ్ లో 'గీతాంజలి'.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ సినిమాలలో నటించినా ఎందుకో  స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.  తెలుగు కంటే కంటే తమిళంలో ఎక్కువ గుర్తింపు సాధించింది.  తాజాగా అంజలిపై కోలీవుడ్ మీడియాలో పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తీవ్రంగా స్పందించింది.

మీడియాలో అంజలి పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కొంతకాలం క్రితం తమిళ హీరో జై తో లవ్ ఎఫైర్.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఇక నెక్స్ట్ పెళ్లి అనుకునే సమయంలో  బ్రేకప్ కావడం అందరికీ తెలిసిన విషయాలే.   కానీ ఈసారి పెళ్లివార్తలు అలా రాలేదు. వరుడు ఎవరో తెలియదు కానీ త్వరలో అంజలి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందని.. సినిమాలకు కూడా గుడ్ బై చెప్తుందని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. దీనిపై స్పందించిన అంజలి అసలు "నేను సినిమాలకు గుడ్ బై చెప్తున్నానని ఎవరు చెప్పారు?" అంటూ ప్రశ్నించింది.

అవన్నీ రూమర్స్ అని..అసలు ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదని క్లారిటీ  ఇచ్చింది.  ఒకవేళ పెళ్లి చేసుకున్నా సినిమాలకు ఎందుకు దూరం అవుతానంటూ ప్రశ్నిస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని గ్లామరస్ గా కనిపించడానికి కూడా తనకు అభ్యంతరం లేదని చెప్పింది.  అంజలి నటించిన తమిళ చిత్రం 'నాడోడిగళ్ 2' త్వరలో రిలీజ్ కానుంది.  ఈ సినిమా కాకుండా మరో అరడజను తమిళ సినిమాల్లో  హీరోయిన్ గా నటిస్తోంది.

 
    

Tags:    

Similar News