దక్షిణాది అగ్ర కథనాయికల్లో ఒకరిగా వెలుగొందిన అనుష్క.. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమే అయింది. 'అరుంధతి' 'బాహుబలి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్వీటీ శెట్టి.. చివరిగా ‘నిశ్శబ్దం’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అది కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది.
అప్పటి నుంచి నిశబ్దంగా ఉంటూ వస్తున్న అనుష్క.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యువ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ మూవీ చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ నుంచి కొత్త కబురు వచ్చింది.
ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని.. అందులో అనుష్క కూడా పాలు పంచుకుంటుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే ప్రశ్నలకు జవాబు దొరికినట్లైంది. షూటింగ్ స్టార్ట్ అయ్యే రోజున స్వీటీ లుక్ ని కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వయసైపోతున్నా పెళ్లంటే ఆసక్తి చూపించని మహిళ ప్రేమలో పడే కుర్రాడి కథాంశంతో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాక్. అంతేకాదు అనుష్క శెట్టి - నవీన్ పొలిశెట్టి పేర్లు కలిసొచ్చేలా టైటిల్ పెడతారనే ప్రచారం జరుగుతోంది.
అనుష్కకు ఇది 48వ సినిమా. అలానే UV క్రియేషన్స్ లో హ్యాట్రిక్ చిత్రం. ఇంతకముందు ఇదే బ్యానర్ లో 'మిర్చి' 'భాగమతి' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. యూవీ సంస్థకు లక్కీ హీరోయిన్ గా మారిన అనుష్క.. ఈసారి కూడా సక్సెస్ అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా పలు ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మన జాతిరత్నం పొలిశెట్టితో కలిసి స్వీటీ శెట్టి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.