స్వీటికి రాక కాదు..లేక ఖాళీగా ఉంటుందా?

Update: 2022-07-17 15:30 GMT
స్వీటీ అనుష్క సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం `నిశ్వ‌బ్దం` త‌ర్వాత ఇంత వ‌ర‌కూ అధికారికంగా ఒక క‌మిట్ మెంట్ కూడా లేదు. అంత‌కు ముందు `భాగ‌మ‌తి`తో మెప్పించింది. ఈ రెండు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే. మ‌ధ్య‌లో  `సైరా న‌ర‌సింహారెడ్డి`లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్ గా `బాహుబ‌లి` త‌ర్వాత ఇంత వ‌ర‌కూ సినిమా చేయ‌లేదు.

గ‌డిచిన ఐదేళ్ల‌ ట్రాక్ చూస్తే ఈ విష‌యం క్లియ‌ర్ గా అర్ధ‌మ‌వుతుంది. గ్యాప్ నేప‌థ్యంలో అనుష్క‌ పెళ్లిపై చాలా వార్త‌లొచ్చాయి. అదీ జ‌ర‌గ‌లేదు. అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి స్నేహితుల్ని కలిసి వెళ్ళ‌డం మిన‌హా అనుష్క కెరీర్ ప‌రంగా బిజీ అయింది లేదు.  ఈనేప‌థ్యంలో  గ్యాప్ త‌నుకు తానుగా కావాల‌నే తీసుకుంద‌న్న రీజ‌న్  హైలైట్ అయింది.

లేడీ ఓరియేంటెడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నా? అనుష్క  తిర‌ర‌స్క‌రిస్తుంద‌ని... హీరోయిన్ ఆఫ‌ర్ల విష‌యంలోనూ అలాంటి నిర్ణ‌యంతోనే ముందుకు వెళ్తుంద‌ని మెజార్టీ వ‌ర్గం భావిస్తుంది. ఏ భాష‌లోనూ సినిమాల‌కు చేయ‌క‌పోవ‌డానికి కేవ‌లం వ్య‌క్తిగ‌త కార‌ణాలే అంటూ ఇప్ప‌టికీ వార్త‌లొస్తున్నాయి.

మ‌రి ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంత‌? అనుష్క కావాల‌నే ఖాళీగా ఉంటుందా? లేక అవకాశాలు లేక ఖాళీగా ఉంటుందా? అంటే తాజా అప్ డేట్ ని బ‌ట్టి వీటికి స‌రైన స‌మాధానం దొర‌క‌డం క‌ష్టంగానే అనిపిస్తుంది. అయితే అవ‌కాశాలు రాక‌నే ఖాళీగా ఉంటుంద‌న్న‌ది కొంత మంది బ‌ల‌మైన వాద‌న‌. ఇటీవ‌లే యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేయ‌డానికి సంత‌కం చేసిన‌ట్లు వెలుగులోకి రావ‌డ‌మే ఈ వాద‌నికి బ‌ల‌మైన పునాది వేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే అనుష్క స‌డెన్ గా యంగ్ హీరోతో క‌మిట్ అవ్వ‌డం వెనుక అంత‌రార్ధం ఏంటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అప్పుడు వ‌చ్చిన అవ‌కాశాల్ని కాద‌నుకుని ఇప్పుడు చిన్న హీరోతో సినిమా చేయ‌డం ఏంటి?  అప్ప‌ట్లో అవకాశాలు వ‌చ్చిన మాట వాస్త‌మైనా..ఇప్పుడా ఛాన్సులు ఇంటి త‌లుపు త‌ట్ట‌ని కార‌ణంగానే ఈ ఛాన్స్ కి య‌స్ చెప్పాల్సి వ‌చ్చింద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. మరి అనుష్క వీటికి ఎలాంటి ముగింపు ప‌లుకుతుంతో?  చూడాలి.

ప్ర‌స్తుతం అనుష్క‌ బెంగుళూరులో కుటుంబ స‌భ్యుల‌తోనే ఉంటుంది. ఉద‌యాన్నే యోగా..జిమ్ చేసి ఫిట్ నెస్ కాపాడుకోవ డం..మంచి డైట్ తీసుకోవ‌డం..కుటుంబ స‌భ్యుల‌తో క‌బుర్లు చెప్పుకోవ‌డం ఇదే అనుష్క దిన‌చ‌ర్య‌గా  తెలుస్తోంది. 
Tags:    

Similar News