హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్‌ను రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాధారణంగా పోలీసులు కన్నెత్తి చూసేందుకు సైతం సాహసించని స్థాయిలో ఉండే ఒక స్టార్ హోటల్లో ఒక బాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తుండగా పట్టుకోవటం సంచలనంగా మారింది.
బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్లో బాలీవుడ్ నటికి ఒకరు ప్రముఖుల పిల్లలు.. సంపన్న వర్గాల వారికి గాలం వేస్తూ ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక రాత్రికి రూ.లక్ష వసూలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన మెరుపు సోదాలో బాలీవుడ్ నటి వ్యభిచార దందాను బయట పెట్టారు. వ్యభిచారం జరుగుతున్న సమయంలో దాడి చేసిన పోలీసులు.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నటితో పాటు.. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి దందాకు సాయం చేస్తున్న హోటల్ మేనేజర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.50వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టిస్తున్న ఈ వైనంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందన్న మాట వినిపిస్తోంది.