హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఛార్మి ప్రస్తుతం పూరి బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. తాజాగా ఛార్మి పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో చిట్ చాట్ చేసింది. ఆ సందర్బంగా గతంలో తాను ఎదుర్కొన్న చీకటి జీవితం గురించి చెప్పుకొచ్చింది. టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు లో తన పేరు రావడంపై మొదటి సారి ఛార్మి స్పందించింది. ఆ కేసు తన జీవితంలోనే చెత్త సంఘటనగా చెప్పుకొచ్చింది.
ఛార్మి డ్రగ్స్ కేసు విషయంలో మాట్లాడుతూ... డ్రగ్స్ కేసులో నా పేరు ఎలా వచ్చిందో తెలియదు, ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. నేను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. అయితే వారికి నాపై పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల వారు నాకు సపోర్ట్ గా నిలిచారు. కొన్ని నెలల పాటు నేను నా కుటుంబ సభ్యులం డిప్రెషన్ లోకి వెళ్లి పోయాం. అయితే నేను ఏ తప్పు చేయలేదు కనుక తప్పకుండా నాకు క్లీన్ చీట్ వస్తుందనే నమ్మకం ఉందని ఛార్మి చెప్పుకొచ్చింది.
ఇదే సమయంలో సినిమాల గురించి ఛార్మి స్పందిస్తూ నటిగా 15 ఏళ్లు చేసి బోర్ కొట్టింది, మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు ఇకపై నిర్మాతగా కొనసాగుతానంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి ప్రశ్నించిన సమయంలో గత 10 ఏళ్లుగా నా పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. కాని నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. ఎప్పుడు చేసుకుంటాను అనే విషయమై చెప్పలేను అంటూ సస్పెన్స్ లో పెట్టింది.