సుమకు నరకాలన్నంత కోపం వచ్చి ఉంటుంది

Update: 2019-01-26 17:30 GMT
ఆడియో వేడుకలకు సుమ వ్యాఖ్యతగా వ్యవహరించాలని స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కోరుకుంటారు. సుమ మాత్రం ఆచి తూచి, ఎంపిక చేసుకుని మరీ సినిమాల వేడుకలను ఒప్పుకుంటూ ఉంటుంది. తాజాగా సుమ మలయాళ చిత్రం 'ఒరు ఆదార్‌ లవ్‌' తెలుగు డబ్బింగ్‌ 'లవర్స్‌ డే' ఆడియో విడుదల కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా సోషల్‌ మీడియా సంచలనం ప్రియా వారియర్‌ నటించడంతో పాటు, అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చిన కారణంగా సుమ హోస్ట్‌ గా వ్యవహరించింది. సుమతో పాటు అలీ కూడా ఈ కార్యక్రమానికి యాంకర్‌ గా వ్యవహరించాడు. అలీ ఏదైనా కార్యక్రమానికి హోస్ట్‌ చేశాడంటే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ నిండుగా ఉంటాయి.

'లవర్స్‌ డే' ఆడియో విడుదల సందర్బంగా కూడా సుమపై, హీరోయిన్‌ పై పలు డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ వదిలి తనదైన శైలిలో ఫన్‌ ను క్రియేట్‌ చేశాడు. కొందరు అలీ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ను ఎంజాయ్‌ చేస్తే మరి కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమతో అలీ ఈ చిత్రంలో హీరో పేరు రోషన్‌, మీ అబ్బాయి పేరు రోషన్‌ కదా, మరి హీరో నీ కొడుకు లాంటి వాడా అంటూ ప్రశ్నించాడు. అందుకు సుమ ఠక్కున అవును నా కొడుకు లాంటి వాడే ఇప్పుడేంటీ అంది. దాంతో అలీ కామెడీగా అయితే రాజీవ్‌ ఎప్పుడు కేరళకు వెళ్లాడు అంటూ డబుల్‌ మీనింగ్‌ తో కామెంట్‌ చేశాడు. అలీ వ్యాఖ్యలతో సుమ మీతో మాట్లాడటం నావల్ల కాదంటూ టాపిక్‌ మార్చేసింది.

సుమ - అలీల మద్య జరిగిన చర్చ వివాదాస్పదం అయ్యింది. అలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలోనే సీనియర్‌ హీరోయిన్‌ దివ్యవాణి స్పందించింది. అలీ అలా మాట్లాడిన సమయంలో సుమకు అలీని నరికేయాలన్నంత కోపం వచ్చి ఉంటుంది. కాని ఏం చేయలేక ఆగిపోయి ఉంటుందని దివ్యవాణి చెప్పుకొచ్చింది. తాను గతంలో అలీతో నటించిన దాఖలాలు అయితే నాకు గుర్తు లేదు, కాని ఆయన అలీతో జాలీగా కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఆ సమయంలో నన్ను కూడా అలాగే అలీ కామెంట్‌ చేశాడు. మీరు 16 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నేను ఉండి ఉంటే వెంట పడేవాడినంటూ కామెంట్‌ చేశాడని దివ్యవాణి చెప్పుకొచ్చింది. ఏదైనా ఇన్నర్‌ ఫీలింగ్‌ ఉంటే మనుసులో ఉంచుకోవాలి కాని అలీ మాత్రం అవతలి వారి గురించి పట్టించుకోకుండా ఠపీమని అనేస్తాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలీ ఇప్పుడే కాదు గతంలో కూడా పలు సార్లు పలువురు హీరోయిన్స్‌ పై కూడా ఇండైరెక్ట్‌ గా వల్గర్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News