బాలీవుడ్ నటి ఈషా గుప్తా తాజాగా చేసిన సోషల్ పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. షాకింగ్ గా ఉన్న ఆమె ఆరోపణలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన ఆమె.. ఆ రెస్టారెంట్ యజమాని తనను చూపులతో తెగ ఇబ్బంది పెట్టినట్లుగా వాపోయారు. స్నేహితులతో కలిసి తింటున్న వేళ.. తన ఎదురుగా వచ్చి కూర్చున్న రెస్టారెంట్ ఓనర్ రోహిత్ దారుణంగా వ్యవహరించారని పేర్కొంది.
ఈ సందర్భంగా సదరు రెస్టారెంట్ యజమాని రోహిత్ ఫోటోను షేర్ చేసింది. తనకు భద్రత కల్పించేందుకు బాడీగార్డులు ఉన్నారని.. అలాంటి తననే తన చూపులతో తెగ ఇబ్బంది పెట్టేశాడని.. అతడి చూపులు తనను అత్యాచారం చేసినట్లుగా అనిపించిందని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.
తనలాంటి అమ్మాయికే దేశంలో భద్రత లేకపోతే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అతడో నీచుడు. అతగాడి లాంటి వారి వల్లే దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందన్న ఆమె.. తనను గుచ్చి.. గుచ్చి చూస్తూ తన చుట్టూనే తిరుగుతూ ఎంతో అసహ్యంగా ప్రవర్తించాడన్నారు.
తానో సెలబ్రిటీ అని అతను అలా చూడలేదని.. అతడి చూపు మాత్రం ఒక మహిళ అసౌకర్యానికి గురయ్యేలా ఉన్నాయని చెప్పారు. ఆమె ట్వీట్ పై మిశ్రమ స్పందన లభించింది. కొందరు మాత్రం ఆమెను తప్పు పడుతూ.. సినిమా విడుదల అవుతుంది కదా.. అందుకే ఈ రచ్చంతా అని కామెంట్ చేశాడు. అతడిపై ఫైర్ అయిన ఈషా.. నువ్వో వెధవవి.. ఆడపిల్లలు ఎక్కడా సురక్షితంగా ఉండకూడదా? లేకపోతే న్యాయవ్యవస్థ కంటే మీరు గొప్పవారని అనుకుంటున్నారా? అని మండిపడటం గమనార్హం.