శవాల మీద మరమరాలు ఏరేస్తున్నారు

Update: 2015-04-14 15:30 GMT
అసలు ఎప్పుడైనా మన ఛానల్స్‌ ఎవరైనా హానీ శివరాజ్‌ అనే హీరోయిన్‌ గురించి ఒక్క ముక్కయినా చెప్పారా? అబ్బే లేదు. కాకపోతే దురదృష్టవశాత్తూ ఆమె ఈరోజు క్యాన్సర్‌ కారణంగా మరణించింది.. సో, ఆ న్యూస్‌ను సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి బాగానే వేసేస్తున్నారు. హీరో కార్తి సరసన 'బిర్యాని' సినిమాలో పనిచేసిన హానీ అంటూ హెడ్‌లైన్స్‌ చాలాసేపు స్క్రోల్‌ అయ్యాయ్‌. బాగానే ఉంది. కాని ఇక్కడితో ఆగట్లేదు మన బాబులు. శావాల మీద మరమరాలు ఏరుకునే బాపత్తులా రచ్చ చేస్తున్నారు.

హానీ శివరాజ్‌ తాలూకు హాట్‌ ఫోటోలతో ఏది ఒక స్పెషల్‌ ప్రోగ్రాం.. హానీ శివరాజ్‌కు ఏమైంది అంటూ ఒక ప్రోగ్రాం.. క్యాన్సర్‌ ఎంతోమంది హీరోయిన్లను, హీరోలను, యాక్టర్లనూ కబళిస్తోంది అంటూ ఒక ప్రోగ్రాం... ఇలా జనాలను భయపడుతూ, కొన్నిచోట్ల హానీ శివరాజ్‌ హాట్‌ లుక్స్‌ తాలూకు వీడియోలను వాడుకుంటూ తెగ క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆమె చనిపోయింది అనే న్యూస్‌కంటే ఆ చావును మనోళ్ళు డెకరేట్‌ చేసిన అందలం ఎక్కిస్తున్న వార్తలే ఎక్కువగా ఉన్నాయ్‌. పోనివ్‌, మామూలుగా చనిపోయిన న్యూస్‌ అయితే పర్లేదు, హాట్‌ వీడియోలతో కూడిన స్పెషల్‌ ఐటెంలు ఒకటి. చావును కూడా క్యాష్‌ చేసుకోవాలా బాసూ?
Tags:    

Similar News