కనీసం జమునకు సారీ చెప్పలేదు

Update: 2017-08-04 05:34 GMT
యంగ్ హీరోలోందరూ స్టార్ హీరోలు అయిపోయే క్రమంలో లేదంటే ఆల్రెడీ అయిపోయిన క్రమంలో.. తమ చుట్టూ అస్సలు జనాలు ముసరకడదని బౌన్సర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఈ బౌన్సర్లందరూ కూడా హీరో దగ్గరకు ఎవ్వరు వస్తున్నా కూడా నెట్టేస్తారు. అసలు ఒక్కోసారి పొరపాటున ఎవరన్నా ఆ దారిలో వెళుతుంటే చాలు.. వాళ్ళు నెట్టిపాడేస్తారు. అలాంటి ఓ సంఘటను ఇప్పుడు టాలీవుడ్ కు షాకిచ్చింది.

మొన్న హైదరాబాదులో జరిగిన ఓ పెద్ద పెళ్ళిలో చాలామది సెలబ్రిటీలు సందడి చేశారు. అక్కడికి పాత తరం హీరోయిన్ జమున కూడా వచ్చారు. ఇక అదే సమయంలో ఈ యువ్ హీరో తన బౌన్సర్లతోపాటు విచ్చేశాడు. కట్ చేస్తే.. అటుగా నడుస్తున్న జమునను చూసి.. ఎవరో ముసలావిడ మన బాస్ తో సెల్ఫీ కోసం వస్తోంది అనుకున్నారేమో నల్లరంగు బట్టలేసుకున్న బ్రెయిన్ లేని బౌన్సర్లు.. వెంటనే ఆమెను నెట్టేశారు. దానితో ఆమె కింద పడిపోయింది. కనీసం వారు చేయిచ్చి ఆమెను లేపకపోగా.. అటుగా చూస్తున్న హీరో కూడా నేనేం చూడ్లేదు అన్నట్లు కనీసం సారీ కూడా చెప్పకుండా జంప్ అయిపోయాడట.

ఆ సన్నివేశాన్ని చూసి చాలామందికి గుండె జారిపోయింది. అసలు జమున గారిని అలా తోసేయడమే పెద్ద తప్పుఅయితే.. కనీసం ఆమెకు సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం పొగరుకు నిదర్శనం అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా జమున మాత్రం.. అంతటి సీనియార్టీ ఉండి.. ఈ వయస్సులో ఇలాంటి అవమానాలకు గురవ్వడం టాలీవుడ్ కే అవమానం. వెంటనే బౌన్సర్లకు తెలుగు సినిమాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు.. అలాగే ఇలాంటి హీరోలకు సీనియర్లను గౌరవించడంపై క్లాసులు పెట్టించాలేమో.


Tags:    

Similar News