బాలీవుడ్ మాఫియాపై క్వీన్ కంగన మరోసారి నిప్పులు చెరిగారు. ఈసారి కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించారు. ఒక సెక్షన్ పై `బికారి ఫిలింమాఫియా` అంటూ చెలరేగారు. తనను పిచ్చిది అని ప్రచారం చేసారని.. వారి అడ్వాన్స్ లను తిరస్కరించినప్పుడు తనను జైలుకు పంపడానికి ప్రయత్నించారని కూడా ఆరోపించారు. ``ఇతర అమ్మాయిలలాగా ముసిముసి నవ్వులు నవ్వడం.. ఐటెం నంబర్లు చేయకపోవడం.. పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయకపోవడం.. రాత్రిపూట హీరోల గదులకు వెళ్లేందుకు నిరాకరించడం వల్ల నన్ను పిచ్చిదానిగా ప్రకటించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు`` అని తెలిపారు. ఇది వైఖరి అనాలా లేదా సమగ్రత అనాలా? అని సూటిగా ప్రశ్నించారు.
ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నందుకు కంగన తన తల్లిగారిని ప్రశంసించిన తర్వాత సుదీర్ఘంగా ట్విట్టర్ లో చర్చ సాగింది. సోమవారం ఉదయం కంగనా ట్వీట్ చేస్తూ.. ``దయచేసి గమనించండి. నా తల్లి ధనవంతురాలు కాదు.. నేను రాజకీయ నాయకులు.. అధికారులు .. వ్యాపారవేత్తల కుటుంబం నుండి రాలేదు. అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా ఉంది. వ్యవసాయం చేసింది. సినిమా మాఫియా నా వైఖరి ఎక్కడ నుండి వచ్చిందో అర్థం చేసుకోవాలి. నేను కొందరిలాగా పెళ్లిళ్లలో చౌకైన దుస్తులు ధరించి డ్యాన్స్ ఎందుకు చేయలేదు?`` అని కంగన తన వైఖరిని వెల్లడించారు.
``బికారి ఫిల్మ్ మాఫియా అహంకారం! అంటూ కంగన హుంకరించారు. నన్ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ విషయం ఏమిటంటే నేను నా కోసం ఏమీ కోరుకోవడం లేదు. నేను ఒక సినిమా (ఎమర్జెన్సీ) చేయడానికి ప్రతిదీ తనఖా పెట్టాను. ఈ రాక్షసులు అంతరించిపోతారు. తలలు దొర్లుతాయి.. ఎవరూ నన్ను నిందించకండి.. అంటూ క్వీన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ లో ఆ నలుగురు లేదా ఆ పదిమంది ఇన్ సైడర్స్ ఫిలింమేకర్స్.. హీరోలపై నిరంతరం కంగన తనదైన శైలిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం తన ఆస్తులు తనఖా పెట్టి నిర్మించి రిలీజ్ చేస్తున్న ఎమర్జెన్సీ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగన .. చాలా ముందుగానే తనదైన శైలిలో ప్రచారం మొదలు పెట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.