డైరెక్టర్ కారణంగా ఇబ్బంది పడిన కృతి శెట్టి

Update: 2022-07-10 15:36 GMT
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి చాలా తొందరగానే ఇండస్ట్రీలో చకచకా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉండడంతో ఓ వర్గం హీరోలు ఈ బ్యూటీతో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక కృతి శెట్టి కూడా తొందరపడకుండా తనకు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న డిఫరెంట్ స్టోరీలను కూడా యాక్సెప్ట్ చేస్తుంది.

దానికి తోడు ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. బంగార్రాజు సినిమా తో పాటు శ్యామ్ సింగరాయ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కృతి శెట్టి పారితోషకం కూడా అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం ది వారియర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి విజయాన్ని అందుకొని మరింత బిజీ అవ్వాలని అనుకుంటుంది.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి శెట్టి ది వారియర్ సినిమా షూటింగ్లో పడిన ఒక ఇబ్బంది గురించి తెలియజేసింది. డైరెక్టర్ లింగుస్వామి కారణంగా ఆమె భాష విషయంలో కొంత ఇబ్బంది పడిందట. లింగుస్వామికి తమిళ దర్శకుడు కావడంతో అతనికి తెలుగు అంతంత మాత్రమే వచ్చు అని అయితే అప్పటికే తనకి తెలుగు అర్థం చేసుకునే అవగాహన ఉంది అని కాకపోతే ఆయన తెలుగు తమిళ్ మిక్స్ చేయడం వలన పెద్దగా అర్థమయ్యేది కాదని తెలిపింది.

ఇక పక్కనే ఉన్న రామ్ పోతినేని కారణంగా తమిళం కూడా చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే అంతకుముందే రామ్ పోతినేనికి తమిళం బాగా వచ్చు. దీంతో ఈసారి ది వారియర్ సినిమా ద్వారా తమిళం పై కూడా అవగాహన పెంచుకున్నాను. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా ఇష్టపడి చేశాను.. అని కృతి శెట్టి తెలియజేసింది.
Tags:    

Similar News