ఉత్తరాది క్వీన్స్ అంతా ఏకమయ్యారు. పురుషాధిక్య ప్రపంచం పని పడుతున్నారు!! వేధింపుల రాయుళ్లకు కటకటాలు చూపించే పనిలో బిజీగా ఉన్నారు. మీటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యమంలో మేము సైతం అంటూ కొత్త ప్రకంపనాలకు తెర తీశారు. తనూశ్రీ దత్తా ఓపెన్ గా తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందుకు రావడంతో ఈ క్యూలో చాలా మంది బాధితురాళ్లు బయటకు వచ్చి గొంతు వినిపిస్తున్నారు. డేర్ ప్రదర్శించి బిగ్ షాట్స్ పేర్లు బయటకు చెప్పేస్తుండడంతో కొత్త తలనొప్పులు కొందరికి ఎదురవుతున్నాయి. ఈ జాబితాలో తొలి బిగ్ షాట్ - వికాస్ బాల్. క్వీన్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన వికాస్ పై కంగన తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు కంగన ఫ్రెండు లైన్ లోకొచ్చింది. అవును నిజమే.. క్వీన్ (2014) సినిమా టైమ్ లో వికాస్ నన్ను కూడా వేధించాడంటూ నాయని ధీక్షిత్ అనే క్యారెక్టర్ నటి కూడా లైమ్ లైట్ లోకి రావడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని సన్నివేశం నెలకొంది.
దీంతో ఒక్కసారిగా ఖంగు తినడం హృతిక్ రోషన్ వంతు అయ్యింది. ప్రస్తుతం వికాస్ బాల్ స్టార్ హీరో హృతిక్ నటిస్తున్న `సూపర్ 30` సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఆ ప్రాజెక్టుకి కొన్ని ఆటంకాలు మొదలయ్యాయి. వికాస్ బాల్ తప్పు చేశాడని ప్రూవ్ అయితే ఎలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికైనా నిర్మాతలకు అండగా ఉంటానని హృతిక్ ట్విట్టర్ లో ప్రకటించాడు. మగువలకు ఎలాంటి ఆపద తలపెట్టినా తాను వారికి సపోర్ట్ చేయలేనని తెలిపాడు. దీంతో వివాదం పెద్ద స్థాయికే చేరుకుంటోంది.
ఇకపోతే క్వీన్ కంగన తర్వాత ఒకరొకరుగా వికాస్ బాధితురాళ్లు బయటకు వస్తున్నారు. నటి నాయని ధీక్షిత్ ఆన్ సెట్స్ తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపింది. క్వీన్ చిత్రీకరణలో ఉన్న సమయంలో దర్శకుడు వికాస్ తనపై చెయ్యి వేయబోతే వార్నింగ్ ఇచ్చానని తెలిపింది. ఇంకోసారి చెయ్యేస్తే చంపేస్తా!!నని హెచ్చరించానని వెల్లడించింది. నాకు 2స్టార్ హోటల్ లో బస ఇచ్చారు. అయితే అక్కడ ఉండడం ఇబ్బంది కలిగించింది దాంతో వేరే బస ఏర్పాటు చేయరా? అని వికాస్ ని అడిగితే తన రూమ్ లో షేర్ చేస్కుంటాను.. రమ్మని అడిగాడు.. అంటూ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో వికాస్ బాల్ తన అపరాధత్వాన్ని నిరూపించుకోవాల్సిన సన్నివేశం వచ్చేసింది. కంగనకు - తనూశ్రీకి అంతకంతకు బలం పెరుగుతుండడం - అట్నుంచి వెల్లడయ్యే వాటికి ఆధారాలు ఎంత? అన్నది అటుంచితే ముందైతే సదరు పురుష పుంగవులు సంఘంలో బ్యాడ్ అయిపోవడం గమనించదగ్గది. ప్రస్తుతానికి అసలేం జరుగుతోంది? అన్నది కాస్త గందరగోళమే. కంగన కోస్టార్ నాయని ధీక్షిత్ సంచలన ఆరోపణల నేపథ్యంలో జనం ఏ స్టాండ్ తీసుకుంటారు? అన్నది చూడాలి. మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో వికాస్ బాల్ కి హీరో హృతిక్ రోషన్ - సహచర నిర్మాత పాంథమ్ బ్యానర్ అధిపతి విక్రమాధిత్య మోత్వానీ దూరం అవ్వడం చూస్తుంటే అతడు చేసినవన్నీ నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.