మరో హీరోయిన్‌ వివాహ నిశ్చితార్థం క్యాన్సిల్‌

Update: 2022-08-07 15:30 GMT
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్‌. ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం ప్రేమించి పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే బ్రేకప్ అవుతున్నారు. కొన్ని జంటలు మాత్రం నిశ్చితార్థం అయిన తర్వాత.. మరి కొందరు పెళ్లి అయిన తర్వాత బ్రేకప్‌ అవ్వడం మనం చూస్తున్నాం.

తాజాగా పెళ్లికి నిశ్చితార్థం కూడా జరిగింది.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని అనుకుంటున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్‌ అంటూ పుకార్లు షికార్లు చేయడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. హీరోయిన్ గా పూర్ణ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బుల్లితెరపై కూడా తనదైన ముద్రను వేసి ఇప్పుడు వెండి తెర మరియు బుల్లి తెరపై దూసుకు పోతున్న పూర్ణ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది.

కొన్నాళ్ల క్రితం పూర్ణ ఒక వ్యాపారవేత్త తో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించింది. పెళ్లి వార్తలను మరింతగా క్లారిటీ ఇచ్చేందుకు గాను తాజాగా పూర్ణ వివాహ నిశ్చితార్థం కూడా అయ్యింది. వివాహం కు ఈ ఏడాది చివర్లో ముహూర్తం ఖరారు చేశారని సమాచారం.

పెళ్లి సమయం దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్‌ వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ పూర్ణ సన్నిహితులుగా పేర్కొంటున్న కొందరు మాత్రం కొన్ని కారణాల వల్ల పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నారు అంటూ చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయమై క్లారిటీ లేదు.

ఇప్పటి వరకు పూర్ణ సోషల్ మీడియా కాని.. నేరుగా మీడియా ద్వారా కాని పెళ్లి విషయాన్ని తేల్చి చెప్పలేదు. ఇప్పటికి కూడా పూర్ణ సోషల్‌ మీడియా పేజ్ ల్లో నిశ్చితార్థం కు సంబంధించిన ఫోటోలు మరియు పోస్ట్‌ లు అలాగే ఉన్నాయి. దాంతో పెళ్లి క్యాన్సిల్ వార్తలు కేవలం పుకార్లు అయ్యి ఉండవచ్చు అనేది కొందరు బలంగా నమ్ముతున్నారు. పూర్ణ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News