స్క్రీన్ మీద బొద్దుగుమ్మల లెక్క చెప్పి ఆశ్చర్యపరిచింది

Update: 2021-08-11 03:20 GMT
స్విలర్ స్క్రీన్ మీద నాజుగ్గా కనిపించే హీరోయిన్లది ఒక ఎత్తు అయితే.. వెండితెర మీద కాస్తంత బొద్దుగా కనిపించినంతనే.. వారిని బొద్దుగుమ్ముల్ని చేసేసి.. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాడీ షేప్ మీద ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా? అంటూ కామెంట్లు చేసే వారు చాలామందే కనిపిస్తారు. కానీ.. అలా బొద్దుగా కనిపించే భామలు సైతం స్లిమ్ గానే ఉంటారు. వెండితెర మాయాజాలంతో అలాంటి పరిస్థితి కొంతమేర ఉంటుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. సింఫుల్ గా బొద్దుగా ఉన్నారన్న కామెంట్.. సదరు నటి మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో.. కొందరు హీరోయిన్ల మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతుంది.

వాస్తవంగా కనిపించే రూపానికి దాదాపు 30 శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపించటం స్క్రీన్ మీద జరుగుతుంది. దీంతో.. నార్మల్ షేప్ లో ఉన్న వారు సైతం బొద్దుగా కనిపిస్తారు. అదే.. వెండితెర మీద సన్నజాజిలా కనిపించేవారు మరెంత స్లిమ్ గా ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సన్నగా పీలగా ఉండటం స్క్రీన్ మీద బాగున్నప్పటికి.. విడిగా చూసినప్పుడు చీపురు పుల్ల మాదిరి ఉంటారని చెప్పాలి. ఇక.. బొద్దుగా ఉన్నారన్న ఇమేజ్ వచ్చేసిన నటీమణుల మీద ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు.

అలాంటి ఇమేజ్ ను పోగొట్టుకోవటం కోసం కొందరు పడే కష్టం గురించి తెలిస్తే.. షాక్ తినాల్సిందే. ఒకే వారంలో ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు విడుదల కావటం ఈ మధ్యన చాలా తక్కువ. కానీ.. అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకుంది టాక్సీవాలా బ్యూటీ ప్రియాంకా జవాల్కర్. తిమ్మరసు.. వారాంతంలో వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం రెండింటిలోనూ హీరోయిన్ ప్రియాంకే. తిమ్మరసుకు పాజిటివ్ టాక్ రాగా.. ఎస్ఆర్ కళ్యాణమండపానికి మాత్రం మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే.. ఈ మధ్యన ప్రియాంక బొద్దుగా తయారైందన్న మాట తరచూ వినిపిస్తోంది.

అయితే..ఉన్నట్లుండి బరువు పెరగటం.. ఎందుకిలా అని టెస్టులు చేయిస్తే.. థైరాయిడ్.. ఇన్సులిన్ రెసిస్టెన్సీల కారణమని తేలింది. ఆ ఇష్యూస్ కు మందులు వాడుతూనే బరువు తగ్గటం కోసం తీసుకుంటున్న కేర్ అంతా ఇంతా కాదంటూ దాని లిస్ట్ చెప్పుకొచ్చింది.

బరువు తగ్గే క్రమంలో ఫుడ్ మొత్తాన్ని మార్చేయటం.. డైట్ చార్ట్ ను పక్కాగా అమలు చేయటం.. వర్కౌట్స్.. ప్రోటీన్ ఎంత తినాలి? ప్యాట్ ఎంత తినాలి? షుగర్ ఎంత? లాంటి లెక్కలతో తినాల్సి వచ్చేది. ఒక దశలో షుగర్ లేని ఫుడ్ కి కూడా అలవాటు పడిపోయిందట. అది కరెక్టు కాదని తెలుసుకొని మళ్లీ షుగర్ అలవాటు చేసుకుందట. వెండితెర మీద వెలిగిపోవాలన్న ఆశ ఒక్కటే కాదు.. అందుకోసం పడాల్సిన కష్టాలు ఎంతన్నది ప్రియాంక మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతుంది.


Tags:    

Similar News