గుండెల్లో గిటారు మోగిస్తున్న అమ్మడు..!

Update: 2022-11-24 16:30 GMT
కన్నడ సినిమా గిల్లితో తెరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కెరటం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఛాన్స్ అందుకుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఆ మూవీ సక్సెస్ అవడంతో రకుల్ కెరీర్ కూడా ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లింది.

తక్కువ టైం లోనే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ అంతే త్వరగా ఫేడవుట్ అయ్యింది. చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ ఇలా స్టార్స్ తో వరుస సినిమాలు చేసిన అమ్మడు కొన్ని క్లిక్ అయినా చాలా వరకు ఫ్లాప్ అవడంతో రకుల్ ని పక్కన పెట్టేశారు. మహేష్ తో స్పైడర్ సినిమా డిజాస్టర్ అవడంతో దాదాపు తెలుగు కెరీర్ ముగిసింది అనిపించగా నాగార్జున మన్మథుడు 2 లో నటించిన రకుల్ ఆ సినిమాతో గ్రాఫ్ మరింత పడిపోయేలా చేసుకుంది.  

వైష్ణవ్ తేజ్ తో కొండపొలం మూవీలో కూడా నటించిన రకుల్ అది కూడా నిరాశపరచడంతో ఇక బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో హడావిడి చేస్తుంది రకుల్. తెలుగులో గ్లామర్ షోకి దూరంగా ఉన్న రకుల్ హిందీలో మాత్రం రెచ్చిపోతుంది. అక్కడ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు. అంతేకాదు ఏదైనా ఈవెంట్స్ లో కూడా రకుల్ తన గ్లామర్ షో చేస్తుంది. లేటెస్ట్ గా ఓ రకుల్ ఓ  ఈవెంట్ కి అమ్మడు జిగెలు అనిపించే డ్రెస్ తో వచ్చింది.

తన సంపద మొత్తం కనిపించేలా రకుల్ వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా ఆమాత్రం షో చేయకపోతే ఎలా అనుకుందో ఏమో కానీ రకుల్ చేస్తున్న ఈ హాట్ షోకి ఆమె ఫ్యాన్స్ మాత్రం పిచ్చెక్కిపోతున్నారు. చలికాలం తన సొగసులతో వేడెక్కించేస్తుంది రకుల్. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా రకుల్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. తెలుగులో మళ్లీ ఓ కం బ్యాక్ మూవీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది రకుల్.

ఆ ఛాన్స్ ఎవరిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ తెలుగు దర్శక నిర్మాతలకు టచ్ లోనే ఉంటుంది రకుల్. ఈసారి తెలుగులో ఏదైనా ఆఫర్ వస్తే మాత్రం తన గ్లామర్ టాలెంట్ తో ఇక్కడ ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయ్యింది రకుల్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News