రిచా చద్దా.. ఇటీవల ప్రముఖంగా వినిపించిన పేరు ఇది. నిరంతరం మీడియా కథనాల్లో ఆ పేరు పదే పదే ప్రస్థావనకు వచ్చింది. అనురాగ్ బసు- పాయల్ ఘోష్ ఎపిసోడ్ లో కి అనవసరంగా ఈ పేరును డ్రాగ్ చేయడంతో అది కాస్తా హైలైట్ అయ్యింది. ఆ తర్వాత పాయల్ పై రిచా కోర్టుకెక్కడం వగైరా వగైరా వ్యవహారాలు తెలిసినవే. రిచా చద్దా నటుడు ఫహద్ ఫాజిల్ తో ప్రేమాయణం సాగిస్తున్న క్రమంలోనూ ఆ వార్తలు హైలైట్ అయ్యాయి.
ఇకపోతే ఇటీవలి వరుస వివాదాల అనంతరం రిచా చద్దాను ప్రముఖ పురస్కారంతో గౌరవించడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రిచా చద్దాను భారత్ రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డుతో సత్కరించారు. ఆ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వయంగా రిచాను సత్కరించడంతో అది కాస్తా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినిమాకు చేసిన కృషికి ఈ నటికి అవార్డు లభించింది. రాజ్ భవన్ లో రిచా ను సత్కరించారు. ఆమె ఇటీవల ఎల్ గౌనా ఫిల్మ్ ఫెస్టివల్ నుండి తిరిగి వచ్చింది. అక్కడ ఆమె మహిళా సాధికారతపై ప్యానెల్ చర్చలో భాగస్వామిగా ఉన్నారు.
డాక్టర్ అంబేద్కర్ అవార్డును స్వీకరించిన అనంతరం రిచా మాట్లాడుతూ.. ``ఇది నా హృదయానికి చేరువైన గౌరవం. గాడ్ ఫాదర్ లేని నటికి ప్రతిదీ విలువైనది. బాగా గౌరవం సంపాదించినట్లు అనిపిస్తుంది. అవార్డు నా కలలను సుస్థిరం చేసి నా విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ దశకు సుదీర్ఘ ప్రయాణం లో నా విలువ వ్యవస్థకు అనుగుణంగా నిలబడటం కిందే లెక్క. వినోదం కంటే ఎక్కువగా అర్థవంతమైన సినిమాలు చేసేందుకే ఎల్లప్పుడూ నా ప్రయత్నం`` అని రిచా అన్నారు. ప్రభుత్వ గౌరవం.. ‘భవిష్యత్తులో మెరుగైన ప్రాజెక్టులను ఎన్నుకోవటానికి ప్రేరేపించింద`ని రిచా ఆనందం వ్యక్తం చేశారు.
రిచా చద్దా 2008 లో ఓయ్ లక్కీ! చిత్రంలో చిన్న పాత్ర ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇందులో అభయ్ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు. 2012 చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ తో ఆమెకు బిగ్ బ్రేక్ దక్కింది. అప్పటి నుండి రిచాకు ఎదురే లేని కెరీర్ సాధ్యమైంది. మాసాన్ .. సరబ్ జిత్ .. లవ్ సోనియా.... సెక్షన్ 375 సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి.
రిచా చివరి థియేట్రికల్ రిలీజ్ పంగా. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. రిచా తన స్నేహితురాలిగా.. నటించింది. షకీలా.. లాహోర్ కాన్ఫిడెన్షియల్ అనే చిత్రాల్లోనూ రిచా నటించింది.