మమ్ముట్టి డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ఎలా ఉంది..!
ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్ తో కలిసి డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సినిమా చేశారు.
మలయాళ స్టార్ మమ్ముట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఆయన వర్సటాలిటీ గురించి తెలిసిన ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆయన్ను అభిమానిస్తారు. తనదైన శైలిలో సినిమా చేసుకుంటూ వెళ్తున్న మమ్ముట్టి ఏదైనా సినిమా చేశాడు అంటే అందులో సంథింగ్ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది అనిపించేలా చేసుకున్నారు. అందుకే ఆయన సినిమాలు స్పెషల్ గా నిలుస్తూ వచ్చాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్ తో కలిసి డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సినిమా చేశారు.
శుక్రవారం రిలీజైన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చింది. ఇంతకీ సినిమా కథ ఏంటి అంటే డొమినిక్ అదే మమ్ముట్టి. ఆయన శ్రీమతి మాధురి (విజి వెంకటేష్) హాస్పిటల్ కు వెళ్తున్న టైం లో ఒక పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ లో కొంత డబ్బుతో పాటు ఒక చైన్ కూడా ఉంటుంది. డొమినిక్ ఆ పర్స్ యజమానిని కనిపెట్టి ఆమెకు ఇచ్చేస్తాడు. ఐతే మాధురి అయిష్టంగానే ఆ పర్స్ ఆమెకు ఇస్తుంది. ఆ టైం లోనే పర్స్ నిజమైన యజమానిని కనిపెట్టేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.. ఇంతకీ డొమినిక్ తన ఇన్వెస్టిగేషన్ లో ఏం కనిపెట్టాడు. ఆ పర్స్ ఎందుకు మిస్ అయ్యింది.. మిగతా కథ ఏంటి అన్నదే డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ కథ.
గౌతం మీనన్ ఎప్పుడు ఒక కొత్త కథతో ప్రేక్షకులను మెప్పించాలని వస్తుంటాడు. ఆయన కథ, స్క్రీన్ ప్లేకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఈమధ్య డైరెక్షన్ మానేసి నటుడిగా స్థిరపడ్డ గౌతం మీనన్ నుంచి ఈ సినిమా వచ్చింది. మమ్ముట్టి ఎనర్జీని బాగానే వాడుకున్నారు. కానీ సినిమా స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అంతేకాదు ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాను కామెడీగా తెరకెక్కించిన విధానం బాగున్నా ఆడియన్ ప్రెడిక్ట్ చేసేలా ట్విస్ట్ లు ఉంటాయి.
సినిమాలో నటీనటులు తమ పర్ఫార్మెన్స్ తో మెప్పించగా టెక్నికల్ టీం పర్వాలేదు అనిపించారు. ఐతే గౌతం మీనన్ మమ్ముట్టి కాంబినేషన్ సినిమా అనగానే ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా మిస్ ఫైర్ అయ్యింది. మమ్ముట్టి నటన కొన్ని సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఐతే స్క్రీన్ ప్లే విభాగంలో గౌతం మీనన్ తనతో పాటు మరొకరికి స్పేస్ ఇవ్వడంతో కథనం కాస్త గాడి తప్పినట్టు అయ్యింది. డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ప్రచార చిత్రాలతో బజ్ క్రియేట్ చేయగా సినిమా మాత్రం జస్ట్ ఓకే అనేలా ఉందని చెప్పొచ్చు.