సారా అలీఖాన్‌తో డేటింగ్.. పొలిటీషియ‌న్‌ కొడుకు లీక్‌లు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ ఈ పుకార్ల గురించి ప్రస్తావించారు. ''మీడియా వ్య‌క్తులు ఏం రాయాలో రాస్తారు. అది వారి పని. ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు.

Update: 2025-01-24 16:30 GMT

ఓవైపు సైఫ్ అలీఖాన్ ట్రాజిక్ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇంత‌లోనే ఇప్పుడు సైఫ్ కుమార్తె, యువ‌హీరోయిన్ సారా అలీఖాన్ డేటింగ్ గురించి బాలీవుడ్ మీడియాలో వ‌రుస‌ క‌థ‌నాలొస్తున్నాయి. సారా తాను డేటింగ్ లో ఉన్న విష‌యాన్ని అధికారికంగా క‌న్ఫామ్ చేసింది అంటూ కొన్ని మీడియా వెబ్ సైట్లు క‌న్ఫామ్ చేస్తున్నాయి.

రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడు, మోడ‌ల్ కం న‌టుడు అర్జున్ తో సారా ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌నేది కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్త‌. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో అర్జున్ - సారా కేదార్‌నాథ్ పర్యటన కు సంబంధించిన ఫోటోల‌లో కలిసి కనిపించారు. తరువాత పోస్ట్ చేసిన వేరే ఫోటోలలో ఆ ఇద్ద‌రూ రాజస్థాన్‌లోని ఒకే ప్రదేశంలో విడివిడిగా పోజులిచ్చారు. ఇద్ద‌రూ ఒకే చోట ఉన్నా విడివిడిగా క‌నిపించార‌ని అభిమానులు గెస్ చేసారు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, వెకేష‌న్‌లో ఉన్నారనే ఊహాగానాలు సాగించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ ఈ పుకార్ల గురించి ప్రస్తావించారు. ''మీడియా వ్య‌క్తులు ఏం రాయాలో రాస్తారు. అది వారి పని. ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. నేను నా ప‌ని మీద దృష్టి పెట్టాను. నేను ఏం చేయాలో దానిపై మాత్ర‌మే దృష్టి పెడతాను. అది నన్ను నిజంగా బాధించదు'' అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు ఈ పుకార్ల‌పై సారా మౌనంగా ఉంది. పుకార్లను ధృవీకరించలేదు, అలాగ‌ని తిరస్కరించనూ లేదు.

అర్జున్ ప్రతాప్ బజ్వా ఎవరు? అంటే.. ప్ర‌ముఖ రాజకీయ నాయకుడు ఫతే సింగ్ బజ్వా కుమారుడు అర్జున్ నటుడు, మోడల్, ఫిట్‌నెస్ ఔత్సాహికుడు. అతడు 'బ్యాండ్ ఆఫ్ మహారాజాస్' అనే చిత్రంలో న‌టించాడు. సింగ్ ఈజ్ బ్లింగ్‌లో సహాయ న‌టుడిగాను క‌నిపించాడు. అర్జున్ శిక్షణ పొందిన ఎంఎంఏ ఫైటర్. అర్జున్ తండ్రి ఫతే సింగ్ బజ్వా పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు. సారాతో డేటింగ్ వార్త‌ల కార‌ణంగా అత‌డు మ‌రింత పాపుల‌ర‌వుతున్నాడు.

సైఫ్ ఖాన్ న‌ట‌వార‌సురాలు సారా న‌టించిన‌ 'స్కై ఫోర్స్' థియేట‌ర్ల‌లోకి విడుద‌లైంది. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్, వీర్ పహరియా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. జనవరి 24న‌ గణతంత్ర దినోత్సవానికి ముందు ఇది థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

Tags:    

Similar News