టొవినో థామస్ ఐడెంటిటీ ఎలా ఉంది..?
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఐడెంటిటీ సినిమా ఈమధ్యనే మలయాళంలో రిలీజ్ అవ్వగా లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ రిలీజైంది.
మలయాళ పరిశ్రమలో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు టొవినో థామస్. వెరైటీ సినిమాలు చేస్తూ కమర్షియల్ హిట్లతో పాటుగా ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాడు అతను. మిన్నల్ మురళి, ఏ.ఆర్.ఎం సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన టొవినో థామస్ లేటెస్ట్ గా ఐడెంటిటీ సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఐడెంటిటీ సినిమా ఈమధ్యనే మలయాళంలో రిలీజ్ అవ్వగా లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ రిలీజైంది.
ఐడెంటిటీ కథ విషయానికి వస్తే.. ఒక టీవీ ఛానెల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేసే అలీషా (త్రిష) ఒక కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక హత్యను చూస్తుంది. ఐతే అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో అలీషాకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ కేసు ఛేధించేందుకు సీఐ అలెన్ జాకబ్ (వినయ్ రాయ్) వస్తాడు. అలీషాకు కూడా ప్రాణహాని ఉందని తెలుస్కుని ఆమెను మారుపేరుతో ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి విచారణ చేస్తారు. ఐతే అలీషా చెప్పిన విషయాల ద్వారా హంతకుడి స్కెచ్ వేయడానికి ఆర్టిస్ట్ హరన్ శంకర్ (టొవినో థామస్) ని పిలుస్తారు. ఐతే అలీషాకు యాక్సిడెంట్ వల్ల ఆమె మనుషులను గుర్తు పట్టలేదు. అసలు హరన్ శంకర్ ఎవరు..? అలెన్ కు సంబందించిన దొరికిన క్లూ ఏంటి..? ఈ ప్రయాణంలో సుప్రియా గోపాల్, రఘునాథ్ ప్రమేయం ఏంటి లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ కు ఎంత బాగా అర్ధమయ్యేలా కథ చెబితే అంతగా కనెక్ట్ అవుతారు. ఐతే ఐడెంటిటీ విషయంలో కన్ ఫ్యూజన్ ఎక్కువ అవ్వడం వల్ల ట్రాక్ తప్పింది. కథ కథనాలు బలంగా రాసుకున్నా అది ఆడియన్స్ కు చేరవేసేలా ఉండాలి. నటీనటుల ప్రదర్శన మెప్పించింది. టెక్నికల్ టీం ఓకే అనిపించింది. ఎటొచ్చి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే లాక్కొచ్చిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ కన్ ఫ్యూజ్ చేశాడు. సినిమా సాగిన విధానం కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది.
ఐతే ఓవరాల్ గా కాస్త ఓపికగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చేస్తుంది. ఐతే కొంత స్లో నరేషన్.. అక్కడక్కడ కొన్ని ఊహించే సీన్స్ ఇబ్బంది పెడతాయి.