గురు సినిమాలో వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ముందు ఏ మాత్రం బెరుకు లేకుండా అతన్ని సవాల్ చేసే స్టూడెంట్ పాత్రలో మెప్పించి ఒప్పించిన రితిక సింగ్ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. లారెన్స్ శివలింగలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత స్క్రీన్ మీద కనిపించలేదు. గురు ఒరిజినల్ తమిళ వెర్షన్ ఇరుమ్బు సుట్రు కు ఫిలిం ఫేర్ తో పాటు పలు అవార్డులు గెలుచుకున్న రితిక సింగ్ స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్. సినిమాల్లో లేదు కాని తన కెరీర్ పరంగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటోంది. కేవలం తన రెగ్యులర్ రొటీన్ కి సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే కాకుండా తన సరదా అనుభవాలు కూడా షేర్ చేసుకోవడం తనకు అలవాటు.
పైన ఫోటో చూసారుగా. అంత దిగాలుగా ఎందుకు కూర్చుంది అని డౌట్ రావడం సహజం. దానికో రీజన్ ఉంది. అది కూడా రితికనే స్వయంగా చెప్పింది లెండి. తాగాలనుకున్న కాఫీ వేడిగా లేకపోవడంతో కాసేపు దాన్ని మైక్రో వేవ్ ఓవెన్ లో పెట్టిన రితిక తీరా బయటకు తీస్తే అది అవసరానికి మించి వేడిగా ఉండటంతో ఎలా తాగాలో అర్థం కాక ఇలా ఫోజిచ్చి తన ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. కామెంట్స్ లో మాత్రం ఫాన్స్ కాఫీ ని పట్టించుకోకుండా రితిక అందాన్ని పొగుడుతూ తన ప్లస్ పాయింట్ అయిన ఉంగరాల రింగు జుట్టు గురించి వర్ణిస్తూ కాసేపయ్యాక కాఫీ తాగమని సలహా ఇచ్చారు. మొత్తానికి చిన్న కాఫీ కప్పుతో పెద్ద చర్చే చేయించింది రితిక.
ప్రస్తుతం రితిక 'వనంగముడి' అనే సినిమాలో అరవింద్ స్వామి తో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీకి దర్శకుడు సెల్వ. ఆగస్ట్ లో విడుదల కానున్న ఆ సినిమాలో నందిత శ్వేత మరో హీరొయిన్ గా నటిస్తోంది. గురు తర్వాత ఆఫర్స్ చాలా వచ్చినా సెలెక్టివ్ గా ఉంటున్న రితిక సింగ్ మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు కాని తను వినే పరిస్థితిలో లేదు మరి.