ఆ రోజంతా సాయిపల్లవి ఏమీ తినలేదట!

Update: 2022-05-30 09:30 GMT
 సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ .. తెరపై హీరో ఎన్నో విన్యాసాలు చేయాలని కోరుకునే ఆడియన్స్, హీరోయిన్ అందంగా ఉంటే చాలనుకుంటారు. అందుకే హీరోయిన్ కి యాక్టింగ్ రాలేదు అనే మాట చాలా తక్కువగా వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే నటన ప్రధానమైన పాత్రలు హీరోయిన్స్ వైఫు రావడం చాలా తగ్గిపోయింది. అందంగా కనిపిస్తూ .. అలసిపోయిన హీరో కోసం ఆడిపాడితే చాలు అనుకుంటారు. వాళ్లకి తెలుగు ఎలాగూ రాదు గనుక, ముద్దుముద్దుగా ఓ నాలుగు  మాటలు చెబితే అదే పదివేలు అనుకుంటారు. అలా గ్లామరస్ గా కనిపించే హీరోయిన్స్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

అందాలు ఆరబోసే  హీరోయిన్స్ కి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లకి  కూడా సక్సెస్ తోడు కావాలనుకోండి ..అది వేరే విషయం. అందం లేకపోయినా ..  ఉన్న అందాన్ని పిండి వడియాల మాదిరిగా ఆరబోయక పోయినా ఇక్కడ ఎవరూ పట్టించుకోరు.

కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తానని ఎదురుచూడటం .. నేతి బీరకాయలో నెయ్యి కోసం ఎదురుచూసినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నటన ప్రధానమైన పాత్రలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్న కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది.

సాయిపల్లవి పెద్ద అందగత్తేమీ కాదు .. అలా అని ఆకర్షణ లేదని చెప్పలేము. విశాలమైన కళ్లతో .. చూపులతోనే చప్పరించేస్తుంది. ఆమె స్కిన్ షో చేయదు ... ఆమెను అలా చూడాలనే భావన కూడా ప్రేక్షకులకు రాదు. ఇంతవరకూ  తాను చేస్తూ వచ్చిన పాత్రలతోనే ఆమె ఒక పవిత్రమైన భావనను తీసుకురాగలిగింది. నటనలోను .. డాన్సులోను ఆమెను అందుకోవడం మిగతా కథానాయికలకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం .. పాత్రలో సహజంగా ఒదిగిపోవడం కోసం ఆమె ఎంత  కష్టమైనా పడుతుందనే పేరు ఉంది.

సాయిపల్లవి అంకిత భావం గురించి ఆమెతో పనిచేసిన దర్శకులంతా  చెబుతూనే ఉంటారు. 'విరాటపర్వం'  సినిమాను ముందుగా జూలై 1వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ జూన్ 17వ తేదీన థియేటర్లకు తీసుకుని రావలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ, పాత్రకి తగినట్టుగా  ఒక సీన్ లో కనిపించడం కోసం సాయిపల్లవి ఒక రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోలేదని చెప్పాడు. ఆమె డెడికేషన్ చూసి తామంతా ఆశ్చర్యపోయామని అన్నాడు. ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని చెప్పాడు. ఆమె నుంచి రానున్న కొత్త ప్రాజెక్టుల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News