ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా సమంత కంబ్యాక్ కనిపిస్తుంది. అనారోగ్యం కారణంగా విశ్రాంతిలోఉన్న అమ్మడు తాజాగా రంగంలోకి దూకేసింది. ప్యాకప్ చెప్పిన ఫేస్ కి ఇప్పుడు మ్యాకప్ అంటూ ముందుకొచ్చేస్తుంది. వస్తూనే `శాకుంతలం` సినిమా చూసేసింది. ఆ సినిమాతో నా రేంజ్ మారిపోతుంది అన్న ధీమాని పరోక్షంగా వ్యక్త పరిచింది. అవును .
ఇదంతా నిజమే నిన్నటి రోజున సమంత అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యమైంది. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో శాకుంతలం సినిమా చూసింది. అనంతరం తనలో సినిమాపై కాన్పిడెన్స్ లెవల్స్ కనిపించాయి. శాకుంతలం తాను అనుకున్న విధంగా వచ్చినట్లు చెప్పకనే చెప్పేసింది. ఇక రిలీజ్ తర్వాత రేంజ్ మారడం ఒక్కటే బ్యాలెన్స్ అన్న చందంగా నిన్నటి సన్నివేశం కనిపించింది.
సమంత కొన్నినెలల క్రితం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి తెలిసిందే. యశోద సినిమా షూటింగ్ దశలోనే వ్యాధికి గురైంది. అయినా షూటింగ్ పూర్తిచేసింది. అయితే రిలీజ్ రిలీజ్ సమయంలో ప్రచారానికి సహకరించలేకపోయింది. అప్పటికే మెడికేషన్ కి వెళ్లిపోవడంతో వీలు పడలేదు. దీంతో సమంత రూపం సహ శరీరంలో చాలా మార్పులొచ్చాయి. అది చూసి అభిమానులు కంగారు పడ్డారు. కానీ నిన్నటి రోజున సమంత నిగనిగలాడింది.
మరింత అందంగా కనిపించింది. మెడికేషన్ అనంతరం బటయకు రావడం...మీడియాకి చిక్కడం కూడా అదే తొలిసారి. మునుపటి కన్నా మరింత అందమైన ఛాయతో కనిపించింది. ఆమెని అక్కడలా చూసి అంతా స్టన్ అయ్యారు. ఆమె సమంతనా? లేక ఇంకేవరైనానా? అని కాసింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె ఎంట్రీతో శాకుంతలం అప్ డేట్ వచ్చేసింది.
కొన్ని నెలలుగా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా పోయింది. షూటింగ్ పూర్తియిన తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో నిర్మాణానంతర పనుల్లో జాప్యమా? లేక సినిమా ఆపేసారా? అని సందేహాలు వ్యక్తం అయ్యాయి. అన్నింటిని సమంత తొలగించింది. అలాగే ఆమె కమిట్ అయిన సినిమా షూటింగ్ లకు యాధావిధిగా హాజరు కానుంది. అనారోగ్యం కారణంగా ఒకటి అర ప్రాజెక్ట్ లు చేజారినా ఇంకా కొన్ని హిందీ సినిమాలు అలాగే ఉన్నాయి. త్వరలో వాటి షూట్ లో బిజీ కానుంది. అలాగే సంక్రాంతి తర్వాత ఖుషీ సెట్స్ కి వెళ్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.