తమిళ హిట్ మూవీ '96'ను తెలుగు లో జాను గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈనెల 7వ తారీకున జాను చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళం లో విజయ్ సేతుపతి మరియు త్రిషలు చేసిన పాత్రను రీమేక్ లో శర్వానంద్ మరియు సమంతలు చేశారు. రీమేక్ అనగానే ఆ పాత్రలను ఎవరు రీప్లెస్ చేయలేరు అనుకున్నారు. కాని దిల్ రాజు చాలా యాంగిల్స్ లో ఆలోచించిన తర్వాత శర్వానంద్ మరియు సమంతలను ఒప్పించాడు.
తాజాగా జాను ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో జాను పాత్ర కోసం తనను బలవంతంగా దిల్ రాజు గారు ఒప్పించాడంటూ సమంత నవ్వుకుంటూ అసలు విషయం చెప్పేసింది. దిల్ రాజు గారు ఫోన్ చేస్తున్నారని మేనేజర్ చెప్పిన వెంటనే లేనని చెప్పమనేదాన్ని. అలా తప్పించుకుని తిరిగినా కూడా దిల్ రాజు గారు నన్ను వదలకుండా ఈ సినిమాలో నటించేలా చేశారంటూ సమంత చెప్పుకొచ్చింది.
నేను హైదరాబాద్ కు వచ్చి ఫస్ట్ దిల్ రాజు గారి ఆఫీస్ లోనే అడుగు పెట్టాను. అందుకే ఆయన అంటే గౌరవం ఉంది. ఆ కారణంతోనే జాను చిత్రాన్ని చేశానంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇష్టం లేకున్నా కూడా దిల్ రాజు గారి రుణం తీర్చుకునేందుకు.. ఆయనపై గౌరవంతో ఈ చిత్రం చేసినట్లుగా సమంత చెప్పకనే చెప్పింది. ఏ కారణంతో చేసినా కూడా సమంత చేసిన జాను పాత్ర ఎప్పటికి నిలిచి పోతుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.