గాయనితో క్రికెటర్ సిరాజ్ అదీ సంగతి
వెటరన్ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లేతో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
వెటరన్ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లేతో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యువ గాయని జనై తన 23వ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో వరుస ఫోటోలను షేర్ చేయగా, వాటిలో సిరాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో హైలైట్ అయింది.
ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్ లో జనై- సిరాజ్ ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు.. చాలా జోవియల్‌గా నవ్వుతూ కనిపించారు. కొద్దిసేపటికే ఆ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. చాలా మంది అభిమానులు వారు డేటింగ్ చేస్తున్నారని భావించారు. అయితే ఈ పుకార్లు సంచలనంగా మారకముందే జనై ఇన్ స్టాలో ఒక స్వీట్ నోట్ రాసింది. సిరాజ్‌తో తన బంధం గురించి స్పష్టం చేస్తూ అతడిని `మేరే ప్యారే భాయ్ (నా ప్రియమైన సోదరుడు)`` అని రాసింది. జనై స్వయంగా సిరాజ్ గురించి పోస్ట్‌ను షేర్ చేయగా, యువ పేసర్ ఆమెను `బెహ్నా (సోదరి)` అని పిలిచాడు. దీంతో ఆ ఇద్దరి మధ్యా బంధం అన్నా చెల్లెళ్ల బంధం అని స్పష్ఠత వచ్చేసింది. ఒకే ఒక్క ఫోటో చూసి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందనుకోవడం తప్పు అని ప్రూవ్ అయింది.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత సిరాజ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తాజా సిరీస్ కి, తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని బోర్డ్ ఎంపిక చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే జట్టులో పేస్ బౌలింగ్ బ్యాకప్ లేకపోవడంపై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అనిశ్చితంగా ఉన్నందున సిరాజ్‌ను చేర్చవచ్చని సూచించాడు. ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్న బుమ్రా ఐసిసి టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా, షమీ ఇప్పుడే గాయాల నుంచి కోలుకున్నందున వారిని ఆడించడం సరి కాదని కూడా పఠాన్ సూచించాడు.