డాకు మహరాజ్.. హిందీలో క్లిక్కయ్యిందా లేదా?

హిందీలో ఈ మూవీ మొదటి రెండు రోజుల్లో కేవలం 10 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది.

Update: 2025-01-27 13:04 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ డాకు మహరాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి తెలుగులో మంచి స్పందన వచ్చింది. బాలయ్య కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ ఖాతాలో వరుసగా నాలుగో హిట్ చేరింది. బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇదిలా ఉంటే 'డాకు మహారాజ్' సినిమాని తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ కథాంశం నార్త్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో అక్కడి ఆడియన్స్ కి కూడా రీచ్ అవుతుందని భావించారు. అయితే ఈ మూవీ హిందీ మార్కెట్ లో ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. హిందీలో ఈ మూవీ మొదటి రెండు రోజుల్లో కేవలం 10 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకున్నారు. కానీ ఎందుకనో ఈ కమర్షియల్ యాక్షన్ మూవీ హిందీ ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు. తెలుగులో భారీ కలెక్షన్స్ అందుకున్న చిత్రానికి హిందీలో మినిమమ్ వసూళ్లు కూడా రాకపోవడం గమనార్హం.

'పుష్ప 2' మూవీ హిందీ బెల్ట్ లో బ్లాక్ బస్టర్ కావడంతో ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ 'డాకు మహారాజ్' పైన ఉంటుందని అనుకున్నారు. అయితే ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఈ మూవీ హిందీలో వర్క్ అవుట్ అయ్యి ఉంటే కచ్చితంగా బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోయే 'అఖండ 2'కి మంచి బిజినెస్ జరిగేది.

అయితే 'డాకు మహారాజ్' హిట్ కాకపోవడంతో 'అఖండ 2' పైన అక్కడి బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఆ చిత్రాన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి బోయపాటి చూపించబోతున్నారు. ప్రస్తుతం మైథలాజికల్ జోనర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దానికి ఆ బ్యాక్ డ్రాప్ కలిసొచ్చే అవకాశం ఉంది.

'డాకు మహారాజ్' కి బాబీ డియోల్ ఇమేజ్ కూడా హిందీలో ఆడియన్స్ ని రప్పించలేకపోయింది. తెలుగులో మాత్రం ఈ చిత్రం 150 కోట్ల క్లబ్ లో లాంగ్ రన్ లో చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి అయితే ఈ ఏడాది 'డాకు మహారాజ్' తో మొదటి సక్సెస్ వచ్చింది. ఇదే జోరుని మేకర్స్ నెక్స్ట్ సినిమాలతో కూడా కొనసాగిస్తారా లేదా చూడాలి.

Tags:    

Similar News