బన్నీ-త్రివిక్రమ్ వచ్చేది 2027 లోనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా గురూజీ ఈ ప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఇది. `పుష్ప-2` సక్సెస్ తర్వాత బన్నీ పాన్ ఇండియా క్రేజ్ రెట్టింపు అవ్వడంతో? స్క్రిప్ట్ లో చిన్నపాటి మార్పులు కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణలు ఎంపికపై గురూజీ దృష్టి పెట్టారు. అలాగే బన్నీకి తీసుకునే హీరోయిన్ విషయంలో గురూజీ తీవ్ర ఆలోచన చేస్తున్నారు. ఏహీరోయిన్ తీసుకోవాలన్నా? పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న నటి అయితే బాగుంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా హీరోయిన్ ఎంపిక కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఇవన్నీ పూర్తి చేసి పట్టాలెక్కించడానికి జూన్ వస్తుందని అంటున్నారు.
మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే కచ్చితంగా ఈ ఏడాది కాదని చెప్పాలి. మరి వచ్చే ఏడాదైనా సాధ్యమవుతుందంటే? అది కూడా జరగదు. ఈ సినిమా షూటింగ్ కోసమే గురూజీ ఏడాదిన్నర కేటాయిస్తున్నారుట. అంటే 18 నెలలు పాటు షూటింగ్ జరుగుతుంది. అటుపై నాలుగు నుంచి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయిస్తారుట.
మైథలాజికల్ సబ్జెక్ట్ కావడం సహా టెక్నికల్ గా ఆడియన్ కి రియల్ ఫీల్ అందించాలంటే ఆ మాత్రం సమయం తప్పని సరిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది 2027లోనైనా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురూజీ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు? అన్నది అద్దం పడుతుంది. ఇప్పటివరకూ ఈ కాంబినేషన్ లో ఫెయిల్యూర్ అంటూ లేదు. చేసిన చిత్రాలన్ని మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.