మగ బిడ్డకు జన్మనిచ్చిన నాని హీరోయిన్..!

ఈ విషయాన్ని ఆమె భర్త వశిష్ట సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. హరిప్రియ తో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

Update: 2025-01-27 13:25 GMT

నాని తో పిల్ల జమిందార్ సినిమా చేసిన హరిప్రియ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త వశిష్ట సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. హరిప్రియ తో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అశోక్ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన పిల్ల జమిందార్ సినిమాలో కథానాయికగా నటించిన హరిప్రియ తన లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో అమ్మడికి తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని సరిగా వాడుకోలేకపోయింది.

కన్నడ హీరోయిన్ అయిన హరిప్రియ అక్కడ మాత్రం ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు తెలుగులో కూడా సినిమాలు చేసింది. పిల్ల జమిందార్ కన్నా ముందే తకిట తకిట సినిమాలో నటించిన అమ్మడు పిల్ల జమిందార్ హిట్ తో పాపులర్ అవగా ఆ క్రేజ్ తో వరుణ్ సందేశ్ తో అబ్బాయ్ క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈరోజుల్లో హీరోతో గలాట సినిమా చేసింది.

నందమూరి బాలకృష్ణతో జై సింహా సినిమాలో కూడా నటించింది హరి ప్రియ. ఐతే తెలుగులో అమ్మడికి సరైన సినిమాలు పడలేదు కానీ కన్నడలో మాత్రం ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2023 లో తెలుగులో హరిప్రియ అలా ఇలా ఎలా సినిమాలో నటించింది. కన్నడ, తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ సినిమాల్లో కూడా అమ్మడు నటించింది.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న హరిప్రియ సినిమాలు సెట్స్ మీద నాలుగు ఉన్నాయి. ఐతే ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న హరిప్రియ ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా గ్యాప్ తీసుకుని తాను కమిటైన సినిమాలు పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. హరి ప్రియ తల్లైన విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఐతే తెలుగు ఆడియన్స్ మరోసారి హరిప్రియ తెలుగులో నటిస్తే బాగుంటుందని కోరుతున్నారు. నానితో కలిసి నటించిన హీరోయిన్ ను ఇక్కడ ఆడియన్స్ కూడా అంత తేలికగా మర్చిపోలేరని చెప్పొచ్చు.

Tags:    

Similar News