అర్జున్ రెడ్డి పిల్ల.. అబ్బాయిలతో ఉందట

Update: 2018-05-27 10:27 GMT
‘అర్జున్ రెడ్డి’లో ప్రీతి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది కొత్తమ్మాయి షాలిని పాండే. అలాంటి పాత్రను అందరూ చేయలేరు. థియేటర్ ఆర్టిస్టు అయన ప్రీతి ఏ మొహమాటాలూ పెట్టుకోకుండా పాత్రకు తగ్గట్లుగా నటించి ఆకట్టుకుంది. ఆ సినిమా ఆమె దక్షిణాదిన చాలా అవకాశాలే తెచ్చిపెట్టింది. దాదాపు అరడజను సినిమాలు ఆమె ఖాతాలోకి వచ్చి పడ్డాయి. కొన్నేళ్ల పాటు ఆమె కెరీర్ కు ఢోకా లేదనే చెప్పాలి. ఐతే ఇప్పుడీ స్థితిలో ఉన్న షాలిని తొలి అవకాశం అందుకోవడానికి ముందు చాలానే ఇబ్బంది పడిందట. ఆమె సినిమాల్లోకి రావడం ఇంట్లో వాళ్లకు అసలేమాత్రం ఇష్టం లేదట. ముందు నాటకాలు చేసి.. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన ఇంట్లో ఆమెకు ఎలాంటి సహకారం లభించలేదట.

సినిమాలొద్దని.. ఐటీ ఉద్యోగం చూసుకోమని షాలిని తండ్రి చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదట. దీంతో సినిమాల్లోకి వెళ్తే బిచ్చమెత్తుకుని బతుకుతావ్ అంటూ మండిపడ్డాడట షాలిని తండ్రి. అప్పుడే తాను ఇంట్లోంచి వచ్చేశానని.. ముంబయిలో ఇద్దరు లేడీ ఫ్రెండ్స్ ఉండేవాళ్లని.. కానీ వాళ్ళతో కలిసి ఉండే అవకాశం లేకపోవడంతో ఇద్దరు అబ్బాయిలున్న రూంలో అడ్జస్ట్ కావాల్సి వచ్చిందని షాలిని చెప్పింది. ముంబయిలో ఇలాంటివి కామన్ అని.. ఆ ఇద్దరూ తను కంటికి రెప్పలా కాపాడుకున్నారని.. ఎప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని.. వాళ్ల వల్లే తాను ప్రపంచాన్ని కొత్తగా చూడటం అలవాటు చేసుకున్నానని షాలిని తెలిపింది. కొన్నాళ్లకు తనకు ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం రావడంతో తన దశ తిరిగిందని.. ఆ సినిమా తర్వాత హైదరాబాద్ వచ్చేశానని.. ఆ ఇద్దరు స్నేహితుల్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని షాలిని చెప్పింది.
Tags:    

Similar News