సినీ ఇండస్ట్రీలో విడాకుల కేసులు పెరిగి పోతున్నాయి. పెళ్లాలతో విడిపోతున్న సినీ సెలెబ్రెటీలకు కారణం మాత్రం అంతుచిక్కడం లేదు. వీరి సినీ వ్యాపకం.. వారిదే వేరే వ్యాపకం కావడంతో ఇమడలేక చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. మన దగ్గర హీరో మంచు మనోజ్ విడాకులు కూడా అందరినీ ఆశ్చర్య పరిచాయి.
తాజాగా బాలీవుడ్ లోనూ విడాకుల కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. రీమేక్స్, బయోపిక్స్ తోపాటు బాలీవుడ్ లో నటిస్తున్న నటీనటుల విడాకులు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి సిమ్రాన్ ఖన్నా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. స్టార్ ప్లస్ చానెల్ లో సూపర్ హిట్ అయిన ‘యేరిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్ లో గాయత్రిగా నటి సిమ్రాన్ నటించి మంచి ప్రేక్షకాదరణ పొంది పాపులర్ అయ్యింది. మరికొన్ని హిందీ సీరియల్స్ లోనూ నటించి హిందీ జనాల మదిలో నటిగా గుర్తింపు పొందింది.
తాజాగా మనస్పర్ధలతో భర్త నుంచి సిమ్రాన్ ఖన్నా విడాకులు తీసుకుంది. తామిద్దరం స్నేహ పూర్వకంగానే విడిపోతున్నామని.. ఇద్దరి మధ్య ఎలాంటి శతృత్వం లేదని.. తమ మార్గాలు వేరని.. అందుకే విడిపోతున్నామని సిమ్రాన్ తెలిపింది. కాగా తమ కుమారుడు వినీత్ ఖన్నాను తన భర్తకే ఇచ్చినట్టు సిమ్రాన్ తెలిపింది. కొడుకును తరుచుగా కలుస్తానని తెలిపింది.