తమిళ నటి విజయలక్ష్మి కన్నడ మరియు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. తెలుగులో ఈమె నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమె పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. ఈమద్య కాలంలో బుల్లి తెరపై సందడి చేస్తోంది. తెలుగులో వచ్చే సూర్యవంశం సీరియల్ లో కూడా ఈమె నటించింది. వెండి తెర బుల్లి తెరపై తనదైన ముద్రను వేసిన విజయలక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
నామ్ తమిళర్ పార్టీ నేత సీమన్ మరియు పవన్ కట్టు పడై నాయకుడు హరి నాడర్ మద్దతుదారులు కొంత కాలంగా విజయలక్ష్మిని సోషల్ మీడియాలో వేదిస్తున్నారట. వేలాది పోస్ట్ లు తనకు వ్యతిరేకంగా చేస్తూ మానసికంగా హింసిస్తున్నారు అంటూ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తాను వారి వేదింపులతో గతంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు వారి వేదింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారి వల్ల నా కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుంది. అందుకే నేను బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఇదే నా చివరి వీడియో అంటూ విజయలక్ష్మి ఫేస్ బుక్ లో వీడియో పెట్టింది.
విజయలక్ష్మిని సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని వైధ్యులు అన్నారట. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇంతకు సీమన్ మరియు హరి నాయర్ మద్దతుదారులు ఎందుకు విజయలక్ష్మిని టార్గెట్ చేశారు. తాను చనిపోయిన తర్వాత అయినా సీమన్ మరియు హరిలకు శిక్ష పడాలంటూ విజయలక్ష్మి తన వీడియోలో చెప్పడంకు గల కారణం ఏంటీ. అసలు పూర్తి విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.