మేము ఉన్నత త‌ర‌గతికి చెందిన‌ వేశ్యలం!

Update: 2021-07-25 00:30 GMT
వ్య‌భిచారం అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వృత్తి. కానీ దుర‌దృష్ఠ‌వ‌శాత్తూ రంగుల ప్ర‌పంచం చుట్టూ జ‌రిగే విష‌యంగా ఫోక‌స్ ఎక్కువ‌. జ‌నాల్లో ఆస‌క్తి క‌లిగించే ఇలాంటి ఒక ప్ర‌త్యేక‌ ఎలిమెంట్ సినీరంగంలో మాత్ర‌మే ఉంద‌ని భావిస్తారు.

ప్ర‌జ‌లు క‌థానాయిక‌ల జీవితాల్లోకి తొంగి చూస్తారు. వాళ్ల విష‌యంలో నెగెటివ్ గానో లేదా పాజిటివ్ గానో చూస్తారు. వ్య‌క్తిగ‌తంగా ఏం జ‌రుగుతోంది? అన్న‌ది ప్ర‌తిదీ ఉత్కంఠ‌ను క‌లిగించేదిగా భావిస్తారు. యువ‌త‌రానికి అది ఎంతో ఎగ్జ‌యిట్ అవుతారు.

తాజాగా బాలీవుడ్ నటి మ‌హికా శ‌ర్మ ,వినోద పరిశ్రమలో నటీమణులను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారని అన్నారు. తాము ఏదో ఒక‌టి త్యాగం చేస్తేనే అవ‌కాశాలొస్తాయ‌ని అంగీక‌రించారు.

స‌ద‌రు న‌టీమ‌ణి ఇంకా ఏమ‌న్నారంటే..``వినోద పరిశ్రమలో ముఖ్యంగా మీరు స్వపక్షపాతి (ఇన్ సైడ‌ర్ లేదా నెపోటిజం న‌టి) కానప్పుడు... చాలా మంది న‌టీమ‌ణులు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బ‌ల‌వుతారు. అందుకే సమాజం నటనను మంచి వృత్తిగా చూడదు`` అని వ్యాఖ్యానించారు.

మేము ఉన్నత త‌ర‌గతికి చెందిన‌ వేశ్యలం! అని ఇక్కడి ప్రజలు అనుకుంటారు. కాలక్రమేణా జ‌నం వారి మనస్తత్వాన్ని మార్చుకోరు.. ప‌రిణ‌తి చెంద‌రు. మ‌మ్మ‌ల్ని గౌరవించరు. ఇది విచారకరం.. అని ఆమె వాపోయారు.

త‌న జీవితంలోని కొన్ని కఠినమైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. భారతదేశంలోని మిస్ టీన్ ఈశాన్య సౌందర్యరాశి పోటీలో గెలిచిన తరువాత కెరీర్ ప్రారంభించిన మహికా... న‌టీమ‌ణిగా కొన‌సాగారు. తాను రాజ్ కుంద్రా అశ్లీల కేసును  ప్రస్తావిస్తూ ఆయ‌న‌ భార్య శిల్పా శెట్టి కుంద్రా ని త‌ల‌స్తే బాధ క‌లుగుతుందని వ్యాఖ్యానించారు. శిల్పా శెట్టిని ప్రేరణగా చూసినప్పుడు... ఆమె భర్త గురించి తెలుసుకోవాల‌నుకోవ‌డం తో మా మ‌న‌సు విచ్ఛిన్నమవుతుందని అన్నారు.

``చాలా మంది ప్రముఖులు నాకు చెప్పారు.. మీరు ఏదైనా ఇస్తేనే మీకు ఏదో ఒక‌టి లభిస్తుంది. లేకపోతే మీరు జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. ఇలాంటి కఠినమైన ద‌శ‌ను నేను ఎదుర్కోవలసి వచ్చింది`` అని అన్నారు. త్వ‌ర‌లో రిలీజ్ కి రానున్న‌ బాలీవుడ్ చిత్రం `ది మోడ్ర‌న్ కల్చర్` లో మహికా  న‌టుడు డానీ డితో కలిసి నటించనుంది. ఇప్ప‌టికే తాను బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించారు.
Tags:    

Similar News