రియ‌ల్ గా హీరోయిన్ కి నిద్ర లేకుండా చేసిన ఆత్మ‌

Update: 2021-12-10 03:30 GMT
రియ‌ల్ లెఫ్ లో ఆత్మ‌లు ఉన్నాయా? ఒక‌వేళ ఉంటే అవి ఘోషిస్తే ఎలా ఉంటుంది? అన్న‌ది వాస్త‌వంగా ఆ ప‌రిస్థితిని ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. శాస్త్రీయ ఆధారాలు లేవు అని అంటారు కానీ.. దెయ్యాలు ఉన్నాయ‌ని న‌మ్మేవాళ్లు చాలా ఎక్కువ‌గా ఉన్నారు..న‌మ్మ‌ని వాళ్లు అంతే పెద్ద శాతం ఉన్నారు. అలాంటి సందిగ్ధంలోనే ఉన్న‌ ఓ హీరోయిన్ రెండు నెల‌లు పాటు నిద్ర లేకుండా గ‌డిపిందంటే న‌మ్మ‌గ‌ల‌రా? దానికి కార‌ణంగా దెయ్య‌మ‌నే భ్రాంతి అని చెప్ప‌క‌నే చెప్పింది. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్ అంటే? ఆమె ఎవ‌రో కాదు న‌టి పూర్ణ‌. పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ర‌విబాబు అప్ప‌ట్లో `అవును` అనే ఓ హార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ర‌విబాబు మేకింగ్..పూర్ణ పెర్పామెన్స్ తో నిజంగా దెయ్యాలు ఉన్నాయ‌నిపించారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేసినంత సేపు ఎలాంటి భ‌యాలు లేవు అంది పూర్ణ‌. ఉద‌యం షూటింగ్ కి వెళ్ల‌డం సాయంత్రం ఇంటికొచ్చి తినేసే ప‌డుకోవ‌డం అంతా హ్యాపీగానే సాగింద‌ని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ త‌ర్వాత రియ‌ల్ సినిమా క‌నిపించింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. సినిమా విడుద‌ల త‌ర్వాత త‌న‌ని బాగా తెలిసిన వ్య‌క్తి ఎవ‌రో వెంటాడుతున్నారోనే భ్రాంతికి కి గురైందిట‌. చీక‌టి ప‌డితే భ‌యమేసిద‌ట‌. బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే త‌న ప‌క్క‌న ఎవ‌రో వ‌చ్చి నిల‌బ‌డిన‌ట్లు..కూర్చున్న‌ట్లు అనిపించేద‌ని అంది.

దాదాపు రెండు నెల‌లు పాటు అలాంటి భ‌యానికి గురైన‌ట్లు తెలిపింది. రెండు నెల‌లు కంటి మీద కునుకు లేకుండా అయిందని..తెల్ల‌వారు ఝామును రెప్ప‌లు మూత ప‌డుతున్న స‌మ‌యంలోనూ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డి పైకి లేచేద‌ట‌. మ‌రి పూర్ణ‌ నిజంగా దెయ్యం వెంటాడిందా? అంతా భ్రాంతా? సినిమాని..అందులో తాను న‌టించిన పాత్ర‌ని ఎక్కువ‌గా ఓన్ చేసుకోవ‌డం వ‌ల్ల అలాంటి ఎమోష‌న్ కి గురైందా? అన్న‌ది ఆమెకే తెలియాలి. పూర్ణ `అఖండ లో`కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది.

ఇండ‌స్ట్రీ వేధింపుల‌పై ఓపెనైంది

సీమ ట‌పాకాయ్ చిత్రంతో అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ బ్యూటీ పూర్ణ‌. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో బ‌బ్లీ పూర్ణ‌కు విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. అందానికి అందం న‌ట‌న ప‌రంగా జూనియ‌ర్ అశిన్ ని త‌ల‌పించింద‌ని పొగిడేశారంతా. అదే క్ర‌మంలో పూర్ణ‌కు తెలుగు చిత్ర సీమ నుంచి బోలెడ‌న్ని ఆఫర్లు వ‌చ్చాయ‌ట‌. అయితే క‌మిట్ అయితేనే ఆఫ‌ర్ అంటూ కొంద‌రు త‌న‌ని వేధించార‌ని కూడా పూర్ణ తెలిపింది. తాను అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే చాలా ఆఫ‌ర్లు రాలేద‌ని అంది. తాను అలా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇంకా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోగ‌లిగాన‌ని కూడా అందాల పూర్ణ వెల్ల‌డించారు. అయితే త‌న‌ని వేధించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎవ‌రు? అన్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

పూర్ణ ఇటీవ‌లే అఖండ‌లో న‌టించారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డం త‌న‌కు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింద‌ట‌. సుదీర్ఘ కాలం చిన్న సినిమాల్లో అయినా త‌న‌కు అవ‌కాశాలు ద‌క్కుతున్నాయ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం పూర్ణ బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. బుల్లితెర వెండితెర అవ‌కాశాల్ని తెలివిగా స‌ద్వినియోగం చేసుకుని కెరీర్ ని సాగిస్తోంది పూర్ణ‌.
Tags:    

Similar News