సౌత్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఏ పాత్రకు వాళ్ళు కరెక్ట్ గా సరిపోతారనేది చూసుకోకుండా.. కమర్షియల్ హీరో అయిపోదాం.. పేరుకి ముందు ఒక స్టార్ ట్యాగ్ తెచ్చుకోడానికి ట్రై చేద్దాం అన్నట్లు విశ్వప్రయత్నాలు చేస్తుంటారనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన టాలెంటెడ్ హీరో అడవి శేష్.. కెరీర్ బిగినింగ్ నుంచే వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అతను ఎంచుకునే కథలు - పాత్రలు.. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఇప్పుడు ''మేజర్'' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శేష్.
26/11 ముంబై టెర్రరిస్టుల దాడుల్లో వీరమరణం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమా రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏ+ఎస్ మూవీస్ సంస్థల సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదలైన 'మేజర్' టీజర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. రెండు రోజుల్లోనే 22 మిలియన్లకు వ్యూస్ రాబట్టి 560K లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. టీజర్ చూసే శేష్ మరో సూపర్ హిట్ కొట్టబోతున్నాడని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో నెపోటిజం స్టార్స్ కూడా అడవి శేష్ ని ఫాలో అవుతూ, కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవచ్చని సౌత్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.