ఆ థియేటర్స్ షేర్స్ పై ఆదిపురుష్ ఎఫెక్ట్

Update: 2023-06-17 18:00 GMT
ఆదిపురుష్ ఫలితం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రకమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. కొంతమంది సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. అయితే హిందుత్వ భావజాలం ఉన్నవారు, అలాగే రామాయణాన్ని ఒక కోణంలోనే చూడటానికి ఇష్టపడే వారు మాత్రం సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే భారీ ఎత్తున జరగడంతో మొదటి రోజు ఏకంగా 138 కోట్ల వరకు గ్రాస్ ని ఆదిపురుష్ రాబట్టింది.

ఇక మల్టీప్లెక్స్ చాలా వరకు మూడు రోజులకి హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో శని, ఆదివారాలు కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా డ్రాప్ కనిపించకపోవచ్చు. త్రీడీలో ఆదిపురుష్ మూవీ చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో కొంత ప్రభావం ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక సోమవారం నుంచి ఆదిపురుష్ అసలు లెక్క మొదలవుతుంది.

అప్పటి నుంచి ప్రేక్షకాదరణ ఎలా ఉండబోతోందనే దానిపై లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. అయితే అయితే సినిమా వ్యాపారంలో దేశంలో మల్టీప్లెక్స్ లో మెజారిటీ షేర్ ఉంటుంది.

వరుస సక్సెస్ లు ఉంటే మల్టీప్లెక్స్ థియేటర్స్ షేర్ వేల్యూ ట్రేడ్ మార్కెట్ లో పెరుగుతూ ఉంటుంది. అయితే హిట్ మూవీస్ లేకపోతే మాత్రం షేర్ వేల్యూ తగ్గిపోతూ ఉంటుంది.

ఇక ఆదిపురుష్ రిలీజ్ కి ముందు పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ షేర్ వేల్యూ భాగానే పెరిగింది. అయితే రివ్యూలు బయటకి వచ్చాక ఊహించని విధంగా 3.40  శాతం క్షీణించి షేర్ వేల్యూ 1448 రూపాయిలకి పడిపోయింది. ఇదంతా ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ప్రభావమే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఆదిపురుష్ రిలీజ్ తర్వాత షేర్ వేల్యూ పెరుగుతుందని భావించారు.

అయితే మొదటి రోజే నార్త్ ఇండియాలో సినిమాకి కంప్లీట్ డివైడ్ టాక్ వచ్చింది. సౌత్ లో కొంత పర్వాలేదనే మాట వినిపిస్తున్న హిందీ ప్రేక్షకులు మాత్రం రామాయణాన్ని వక్రీకరించి చూపించడానికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆదిపురుష్ హిందీ పరిశ్రమని సేవ్ చేస్తుందా మళ్ళీ కష్టాలలోకి నెడుతుందా అనేది తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

Similar News