తిళ్లై నటరాజ స్వామి ఆలయంలో శ్రీలీల ప్రత్యేక పూజలు
పెళ్లి సందడి2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల మొదటి మూవీలోనే తన గ్లామర్, డ్యాన్సులతో ఆకట్టుకుంది
హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల మొదటి మూవీలోనే తన గ్లామర్, డ్యాన్సులతో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీలకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో తక్కువ టైమ్ లోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే శ్రీలీల స్టార్ స్టేటస్ అందుకోవడంతో ఎంతోమంది అమ్మడిని చూసి అసూయ పడ్డారు.
అమ్మడు ఏ సినిమాలో నటించినా ఆమె డ్యాన్సులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు తన డాక్టర్ చదువును కంటిన్యూ చేస్తూ శ్రీలీల చాలా బిజీగా ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే శ్రీలీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో పాటూ ఓ కొత్త స్కిన్ కేర్ బ్రాండ్ ను కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఇంత బిజీలో కూడా శ్రీలీల తన పర్సనల్ టైమ్ ను తాను చాలా సంతోషంగా గడుపుతుంది. ఖాళీ దొరికితే తన తల్లితో కలిసి ఏదొక వెకేషన్ కు చెక్కేసే లీలమ్మ తాజాగా తమిళనాడులోని ఓ గుడికి వెళ్లింది. శ్రీలీల చిదంబరంలోని తిళ్లై నటరాజ స్వామి గుడికి వెళ్లి స్వామి వారి దర్శనంతో పాటూ అక్కడ కొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కి కూడా రంగం సిద్ధం చేసుకుంది. శ్రీలీల ఇబ్రహీం అలీ ఖాన్ తో చేయబోయే సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతుండగా ఇప్పుడు శ్రీలీలకు నార్త్ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టు కోసం శ్రీలీలను ఎంపిక చేశాడని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కిస్సిక్ బ్యూటీ భలే ఆఫర్ పట్టేసిందని నెట్టింట అప్పుడే ప్రచారాలు మొదలైపోయాయి. త్వరలోనే రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటూ రవితేజ మాస్ జాతర, శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలున్నాయి.